Diljit Dosanjh : పంజాబీ సూపర్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) రీసెంట్ గా హైదరాబాద్ స్పెషల్ కాన్సర్ట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. GMR ఎరీనాలో తన దిల్-లుమినాటి టూర్ లో భాగంగా గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో సందడి చేశారు దిల్జిత్ దోసాంజ్. మరి ఆయన ఒక్కో కాన్సర్ట్ కు ఎంత చార్జ్ చేస్తారో తెలుసా?
దిల్-లుమినాటి టూర్ పేరుతో పాపులర్ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దేశవిదేశాల్లో తన ప్రత్యేక మ్యూజిక్ కాన్సర్ట్ లతో మ్యూజిక్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. ఇక ఇటీవల ఢిల్లీ, జైపూర్‌లో తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, హైదరాబాద్ లో మ్యాజిక్ కాన్సర్ట్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే దిల్జిత్ (Diljit Dosanjh) కేవలం సూపర్ సింగర్ మాత్రమే కాదు. ఆయన ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ పర్ఫార్మర్లలో ఒకరు. ప్రైవేట్ ఈవెంట్‌ల కోసం దిల్జిత్ భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్ లాంటి ఈవెంట్స్ కు దిల్జిత్ రూ. 4 కోట్లు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. ఇక సాధారణ కాన్సర్ట్ ల కోసం ఈవెంట్‌ను బట్టి ఆయన రెమ్యూనరేషన్ రూ. 50 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. మరి దిల్జిత్ ను, ఆయన పాటలను అభిమానులు ఎంతగా ఇష్టపడుతున్నారో.. ఆయనకు ఎంత పాపులారిటీ ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయి.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లో దిల్జిత్ (Diljit Dosanjh) మ్యూజిక్ కాన్సర్ట్ జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను ముందుగానే హెచ్చరించింది. కొన్ని పాటలను అయితే అస్సలు పర్ఫామ్ చేయవద్దు అంటూ నోటీసులు జారీ చేసింది. ఆ లిస్ట్ లో దిల్జిత్ పాపులర్ సాంగ్స్ 5 తారా, కేస్, పటియాలా పెగ్, పంగా వంటివి ఉన్నాయి. ఎందుకంటే ఈ పాటల్లో డ్రగ్స్, మద్యపానం గురించిన ప్రస్తావన ఉంది.
మరోవైపు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) పాటల్లో మత్తు పదార్థాలు, మద్యపానం గురించి ప్రచారం చేస్తున్నారనే నెగెటివిటీ కూడా ఉంది. నిజానికి దిల్జిత్ దోసాంజ్ పాపులర్ సింగర్, పైగా ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు, అలాగే వివాదాలు కూడా దిల్జిత్ దోసాంజ్ కు కొత్తేమీ కాదు. ఢిల్లీలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఏకంగా దిల్జిత్ దోసాంజ్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇది వరకు విదేశాల్లో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కాన్సర్ట్ లో పర్ఫామ్ చేసిన కొంతమంది డ్యాన్సర్లకు, ఆయన టీం డబ్బులు ఎగ్గొట్టింది అనే ఆరోపణలు విన్పించాయి. అలాగే దిల్జిత్ దోసాంజ్ షోలకు భారీ రేట్లతో టికెట్లను అమ్మడంపై కూడా తరచుగా విమర్శలు విన్పిస్తాయి.
ఇదిలా ఉంటే దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) పాటలంటే పడిచచ్చే అభిమానులు మన తెలుగులో కూడా చాలామంది ఉన్నారు. ఇక ఈ సింగర్ ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ తో కలిసి ‘కల్కి యాంతమ్’ సాంగ్ లో దర్శనం ఇచ్చారు.