Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయనకు పుస్తకాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చదువును మధ్యలోనే ఆపేసారు. కానీ పుస్తకాలను మాత్రం అస్సలు వదల్లేదు. ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు తీసుకోవడం అలవాటు. రీసెంట్ గా విజయవాడ లో బుక్ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తకాల తో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వతంత్రంగా నాకు ఏం కావాలో నేర్చుకోగలను అనే ధైర్యం వచ్చినపుడు పఠనం మీద దృష్టి నిలిపి నాకు ప్రత్యేకంగా టీచర్ అవసరం లేదని నిర్ణయించుకున్నానని నాకు ఓటమిలోనూ అద్భుతమైన మానసిక శక్తిని పుస్తకాలే అందించాయన్నారు.. ఆయన చేసిన సినిమాలకు వచ్చిన డబ్బులతో కొంత పుస్తకాలను కోనేందుకు ఖర్చు చేస్తానని చెప్పారు..
జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలేనని నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలేనని 2047 కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞాన కాంతులు నిండే సమూహం అవసరంమని, దాని కోసం పుస్తకాలు దారి చూపుతాయని, మన చేతిలో ప్రపంచాన్ని చూపిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంతేకాదు ఈ తరం యువత సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతుంది. మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవండని పవన్ సూచించారు. దీనివల్ల మీరు మానసికంగా బలంగా మారుతారు. సమస్యల ను, కష్టాలను, మనుషులను అర్ధం చేసుకునే తత్వం బోధపడుతుంది. సోషల్ మీడియా లో సమయం వృధా చెయ్యడం కన్నా పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను పట్టుకోండి.. అని పవన్ సూచించారు.
అలాగే ఆయనకు పుస్తకాల పై ఉన్న మక్కువను అందరికి తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ.. నాకు పాకెట్ మని మా వదిన ఇచ్చేది. ఆ డబ్బుతో పుస్తకాలు కొందాం అని వెళ్తే అవి సరిపోయేవి కాదు.. తొలిప్రేమ సినిమాకు రూ.15 లక్షల పారితోషికం వస్తే.. దానిలో 1-2 లక్షలు పెట్టి పుస్తకాలు కొనుక్కోని దేన్ని చదవాలో తెలియక అన్ని పుస్తకాలు చూసి ఆనందపడ్డాను. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 10 వేల పుస్తకాలు చదవవచ్చని నిపుణులు చెబుతారు. మన అభిరుచి ఆధారంగా మీ విజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించండి. పుస్తకాలలో ఉన్న మేధ మరెక్కడా దొరకదు. మీరంతా పుస్తక ప్రియులు కావాలని, తెలుగు భాషను రక్షించాలని, సాహితీవేత్తలను గౌరవించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.. ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఆయన తనయుడు అకీరా కూడా పుస్తకాల పురుగే అని రామ్ చరణ్ ఇటీవల ఓ షో లో బయట పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. హరిహర వీరమల్లు మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఓజీ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది.. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చెయ్యాల్సి ఉంది. ఈ మూవీల ను పవన్ కళ్యాణ్ ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి..