BigTV English

Pushpa 2: ‘పుష్ప 2’ ఖాతాలో మరో రికార్డ్.. ఆ టాప్ 10 సినిమాల్లో ఇదీ ఒకటి

Pushpa 2: ‘పుష్ప 2’ ఖాతాలో మరో రికార్డ్.. ఆ టాప్ 10 సినిమాల్లో ఇదీ ఒకటి

Pushpa 2: ఒక సినిమాపై ఎంత నెగిటివిటీ వచ్చినా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చిదంటే చాలు.. కచ్చితంగా అది హిట్ కేటగిరిలో చేరాల్సిందే. ప్రస్తుతం ‘పుష్ప 2’ కూడా అదే కేటగిరిలో ఉంది. ఈ సినిమా విడుదల కాకముందు నుండే దీనిపై చాలా నెగిటివిటీ వచ్చేసింది. మామూలుగా ఒక సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలంటే ముందు నుండే చాలా ప్రీ ప్లానింగ్ ఉండాలి. ‘పుష్ప 2’ విషయంలో అదే మిస్ అయ్యింది. అందుకే ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. అలా చాలా నెగిటివిటీ మధ్య విడుదలయినా కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతోంది.


మరో రికార్డ్

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా కలెక్షన్స్ విషయంలో మరెన్నో రికార్డులు ఈ సినిమా ఖాతాలో పడ్డాయి. అదే విధంగా తాజాగా మరొక రికార్డ్ ‘పుష్ప 2’ సొంతమయ్యింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతున్నా ఇంకా దీనిని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తూనే ఉన్నారు. అలా అత్యధిక ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన సినిమాల కేటగిరిలో ‘పుష్ప 2’ కూడా యాడ్ అయ్యింది. ప్రస్తుతం టాప్ 10వ స్థానంలో ఉన్న ఈ సినిమా మరింత ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది.


Also Read: బాలయ్య పాటకు నెగిటివ్ రెస్పాన్స్.. అసలు ఏంటిది మాస్టారు.?

టాప్ 10 సినిమాలు

టికెట్ రేట్లు పెరగడం వల్ల కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. కానీ అలా కాకుండా ఆ సినిమాను చూడడానికి ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు అనేది కూడా ముఖ్యమే. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసిన సినిమాగా టాప్ 1వ స్థానంలో ఉంది ‘షోలే’. ఆ మూవీని అప్పట్లోనే దాదాపు 18.2 కోట్లకు పైగా ప్రేక్షకులు చూశారు. ఆ తర్వాతి స్థానంలో ‘బాహుబలి 2’ నిలిచింది. దీనిని 11.3 కోట్లకు పైగా ప్రేక్షకులు చూశారు. ‘బాహుబలి 2’ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డుల్లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత స్థానాల్లో ‘మధర్ ఇండియా’, ‘ముఖద్దర్ కా సికందర్’, ‘క్రాంతి’, ‘గంగా జమున’ లాంటి హిందీ సినిమాలు నిలిచాయి.

మరో అడుగు ముందుకు

అత్యధిక సంఖ్యలు ప్రేక్షకులు వచ్చిన సినిమాల లిస్ట్‌లో ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) టాప్ 10వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను 5.5 కోట్ల మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూశారు. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతోంది కాబట్టి అతి త్వరలోనే టాప్ 9వ స్థానంలో ఉన్న ‘కూలి’ని దాటేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌గా కనిపించింది. మిక్స్‌డ్ టాక్‌తో మొదలయినా కూడా ఈ మూవీకి మంచి కలెక్షన్సే వచ్చాయి. ఇప్పుడు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసిన సినిమాల లిస్ట్‌లో కూడా ‘పుష్ప 2’ యాడ్ అవ్వడం విశేషం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×