BigTV English

Sonam Khan: ‘కొదమ సింహం’.. ఘుమ్.. ఘుమాయించు అందం.. పాటలో చిరుతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇపుడెలా ఉందంటే..?

Sonam Khan: ‘కొదమ సింహం’.. ఘుమ్.. ఘుమాయించు అందం.. పాటలో చిరుతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇపుడెలా ఉందంటే..?

Sonam Khan: మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు గురించి మెగా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆయన కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ హీరోగా నటిస్తూనే ఉన్నారు. కానీ, అప్పట్లో ఆయనతో నటించిన హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మిస్టరీగానే మారింది. కొంతమంది ఇప్పటికీ నటీమణులుగా కొనసాగుతున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు.


ఇక అలా పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిన హీరోయిన్స్ లో సోనమ్ ఖాన్ ఒకరు. చిరంజీవి హీరోగా రాధా హీరోయిన్ గా నటించిన కొదమ సింహం సినిమా గుర్తుందా.. ? కె. మురళీమోహన రావు దర్శకత్వంలో 1990 లో విడుదలైన ఈ చిత్రాన్ని కె. నాగేశ్వరరావు రమా ఫిల్మ్స్ పతాకంపై నిర్మించాడు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించి మెప్పించిన భామ సోనమ్. ఆమె అసలు పేరు సోనమ్ ఖాన్.

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా నటించిన సామ్రాట్.. మూవీతో సోనమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కృష్ణ, ఆయన ఇద్దరు కొడుకులతో చేసిన ముగ్గురు కొడుకులు సినిమాలో ఒక హీరోయిన్ గా నటిచింది. ఈ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే తెలుగులో చాలా రేర్ గా నటించిన సోనమ్.. హిందీ, మలయాళ, బెంగాలీ భాషల్లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మెప్పించింది.


ఇక మధ్యలో చిరు సరసన కొదమ సింహంలో నటించింది. ఇందులో రెండు సాంగ్స్ లో ఆమె చిరుతో డ్యాన్స్ వేసి మెప్పించింది కూడా. ఇప్పటికీ చిరు టాప్ 10 సాంగ్స్ లిస్ట్ లో ఘుమ్ ఘుమాయించు అందం అనే సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సాంగ్ లో మెరిసింది సోనమ్ నే. అదేనా చక్కిలిగింతల రాగం అంటూ వచ్చే మరో మెలోడీలో కూడా సోనమ్, చిరుతో రొమాన్స్ చేసింది.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 1991 లో డైరెక్టర్ రాజీవ్ రాయ్‌ని మ్యారేజ్ చేసుకుంది.. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. తర్వాత సినిమాలు చేయడం ఆపేసిన సోనమ్ భర్తతో విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకొని ఒంటరిగా నివసిస్తుంది. ఇక చాలా గ్యాప్ తరువాత సోనమ్ రీఎంట్రికి రెడీ అయ్యింది.

కరోనా సమయంలో పలు షోలు, వెబ్ సిరీస్‌లు చూశానని, ఇలాంటివి తానెందుకు చెయ్యకూడదు అని అప్పుడే ఫిక్స్ అయ్యానని.. అందుకే ఫిజిక్ మీద ఫోకస్ పెట్టి 30 కిలోల వెయిట్ తగ్గినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ 50 ఏళ్ల సుందరి తెలుగులో కూడా మళ్లీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×