BigTV English

Priyanka Chopra: బ్రేకింగ్ న్యూస్.. షూటింగ్‌లో గాయపడిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra: బ్రేకింగ్ న్యూస్.. షూటింగ్‌లో గాయపడిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra injured: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా షూటింగ్ లో గాయపడ్డారు. సినిమా షూటింగ్ లో ఆమెకు గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను హీరోయిన్ గా నటిస్తున్న ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ముఖం, మెడ, పెదవిపై గాయాలయ్యాయి. దీంతో మేకర్స్ వెంటనే షూటింగ్ నిలిపివేసి ఆమెను సిడ్నీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, ఆమె అభిమానులు.. గాయాల నుంచి ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ప్రార్థిస్తున్నారు.


Also Read: ‘కొదమ సింహం’.. ఘుమ్.. ఘుమాయించు అందం.. పాటలో చిరుతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇపుడెలా ఉందంటే..?

‘ది బ్లఫ్’ మూవీని ఫ్రాంక్ ఇ. ఫ్లవర్ తెరకెక్కిస్తున్నారు. పూర్తి యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. నిపుణల పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రియాంక గాయపడినట్లు సమాచారం. ఈ సినిమాతోపాటు పలు సినిమాల్లో ప్రియాంక చోప్రా నటిస్తోంది. ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నది. విరామం తీసుకోవాలనుకున్న తరుణంలో ‘ది బ్లఫ్’ మూవీకి కాల్షీట్స్ కేటాయించడంతో ఆమె వెంటనే షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×