BigTV English
Advertisement

Doraemon : డోరేమాన్ వాయిస్ ఇకలేదు… ఆలస్యంగా విషయాన్ని వెల్లడించిన ఫ్యామిలీ

Doraemon : డోరేమాన్ వాయిస్ ఇకలేదు… ఆలస్యంగా విషయాన్ని వెల్లడించిన ఫ్యామిలీ

Doraemon : ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లదాకా అందరికీ నచ్చే యానిమేషన్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది డోరేమానే. ఇందులో ఉండే క్యారెక్టర్స్, వాటి స్టోరీస్ ను పిల్లలు కళ్లార్పకుండా చూస్తూనే ఉంటారు. అయితే పిల్లలకు ఆ యానిమేషన్ క్యారెక్టర్స్ అంతగా ఆకర్షించడంలో కీలక పాత్రను పోషించేది వాయిస్. ఆ బొమ్మలకు ఇచ్చే వాయిస్ ఓవర్ ఎంత బాగుంటే అంతగా అట్రాక్ట్ అవుతారు. ‘డోరేమాన్’ విషయంలో కూడా అదే జరిగింది. కానీ తాజాగా డోరేమాన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఎక్కువ కాలం డోరేమాన్ కు వాయిస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తాజాగా కన్నుమూసింది.


ఆలస్యంగా వెలుగులోకి విషయం… 

జపాన్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన యానిమే సిరీస్‌లలో ఒకటైన “డోరేమాన్” టైటిల్ క్యారెక్టర్‌కు గాత్రదానం చేయడంలో ప్రసిద్ధి చెందిన నోబుయో ఒయామా సెప్టెంబర్ 29న 90 ఏళ్ల వయసులో వృద్ధాప్య కారణాలతో మరణించినట్లు మీడియా నివేదికలు శుక్రవారం తెలిపాయి.
1979లో ఈ షో ప్రారంభమైనప్పటి నుండి 2005 వరకు ఒయామా డోరేమాన్ అనే ఈ క్యాట్ రోబోకి తనదైన శైలిలో అసమానమైన రీతిలో గాత్రదానం చేసింది. ఇక ఈ “డోరేమాన్” యానిమే సిరీస్‌ను జపాన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వీక్షించారు. దీనిని 55 భాషల్లోకి అనువదించారు. 2008లో ప్రభుత్వం డోరేమాన్‌ని యానిమే అంబాసిడర్‌గా నియమించడంతో ఈ పాత్ర రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది. అయితే తాజాగా డోరేమాన్ ను ఇంత పాపులర్ చేసిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఒయామా కన్నుమూసింది.


ఒయామా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే… 

1933లో టోక్యోలో జన్మించిన ఒయామా జపాన్ NHK పబ్లిక్ టెలివిజన్‌లో 1956లో టెలివిజన్ లోకి అరంగేట్రం చేశారు. 1957లో టీవీ డ్రామా సిరీస్ “లాస్సీ” డబ్బింగ్ వెర్షన్‌లో ఆమె తన మొదటి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఒయామా గజిబిజి వాయిస్ తో త్వరగానే యానిమే పిల్లల కార్యక్రమాలలో ఆమె ప్రజాదరణ పొందింది. ఆమె 1960ల ప్రారంభంలో ఒక ప్రసిద్ధ పిల్లల తోలుబొమ్మల ప్రదర్శనలో కూడా ఆమె పాల్గొంది. “డోరేమాన్” కంటే ముందు “సజేసన్” అనే ఫ్యామిలీ యానిమే సిరీస్‌ లలో టీనేజ్ అబ్బాయి కట్సువోకి గాత్రం అందించింది. 2001లో ఆమె క్యాన్సర్‌ బారిన పడడంతో డోరేమాన్‌తో పాటు ఆమె అన్ని పాత్రల నుండి విరమించుకుంది. 2010లో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ వీడియో గేమ్ సిరీస్ డంగన్‌రోన్పాలో మోనోకుమా పాత్రకు గాత్రదానం చేసింది. ఒయామా కేవలం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు నటి, గాయకురాలు, అలాగే స్క్రీన్ రైటర్, రైటర్ కూడా. 2005లో ఆమె పరిశ్రమలో చేసిన కృషికి సొసైటీ ఆఫ్ జపనీస్ ఉమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ అవార్డును అందుకుంది. కాగా ఒయామాకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు 2012లో నిర్ధారణ అయినట్లు ఆమె భర్త, నటుడు కీసుకే సగావా ద్వారా 2015లో వెల్లడైంది, 1964లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆమె అంత్యక్రియలను బంధువులు ప్రైవేట్‌గా నిర్వహించారని ఒయామా ఏజెన్సీ తెలిపింది. కాగా నోబితా వాయిస్ అయిన నోరికో ఒహారా జూలైలో మరణించారు.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×