Dragon Trailer: ఈరోజుల్లో కొందరు నటీనటులు, దర్శకులు కేవలం యూత్‌కు నచ్చే సినిమాలపైనే దృష్టిపెడుతున్నారు. అలాంటి సినిమాలే చాలావరకు సక్సెస్ అవుతున్నాయి కూడా. మొదట్లో యూత్‌కు నచ్చే లైఫ్ చూపించడం, తర్వాత దానికి ఎమోషనల్ టచ్ ఇవ్వడం.. ఇదే ఈరోజుల్లో దర్శకులు యూజ్ చేస్తున్న సక్సెస్ ఫార్ములా. అలాంటి యూత్‌ఫుల్ స్టోరీతోనే మరొక సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘డ్రాగన్’. ‘లవ్ టుడే’ మూవీతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. ఈసారి ‘డ్రాగన్’తో మరో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది.
పొగరున్న క్యారెక్టర్
‘‘అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మాయిలు అలాంటి బాయ్‌ఫ్రెండ్‌తో కాలేజ్‌కు వెళ్లినప్పుడే ఆ పొగరు ఉంటుంది కదా’’ అంటూ హీరోయిన్ చెప్పే క్రేజీ డైలాగ్‌తో ‘డ్రాగన్’ (Dragon) ట్రైలర్ మొదలవుతుంది. ‘‘ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 సప్లీస్ ఉంచినోడు ఎవడూ ఉండడు కదా’’ అంటూ తన గురించి తాను చెప్పుకునే డైలాగ్‌తోనే అసలు ప్రదీప్ క్యారెక్టర్ ఏంటనే విషయం బయటపడుతుంది. నడుముపైన ఉన్న టాటూను హీరోకు చూపిస్తూ ఎంట్రీ ఇస్తుంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). ఆ తర్వాత ప్రదీప్ లైఫ్‌లో ఉండే లవ్, అనుపమతో ఉండే రొమాన్స్ అంతా ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు. ఆపై ట్రైలర్ మరో మలుపు తిరుగుతుంది.
ఎమోషనల్ టర్న్
కాలేజ్‌లో సరిగా చదువుకోకుండా, ఎప్పుడూ పొగరుగా అందరితో గొడవపడుతూ ఉండే ప్రదీప్ అందరికీ ఒక చెడ్డ ఉదాహరణ అవుతాడు. తన ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ తనకు ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులను నమ్మిస్తూ ఉంటాడు హీరో. అక్కడే ట్రైలర్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. తల్లిదండ్రులు, ప్రేమికురాలు తనకోసం ఎంత ఆలోచించినా అది తనకు అర్థం కావడం లేదని, తానొక ఫెయిల్యూర్ అని ప్రదీప్ రంగనాథన్ గ్రహిస్తాడు. బాధపడతాడు, వెంటనే సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు. సక్సెస్ అవ్వడం కోసం ఎలాంటి తప్పు చేయడానికి అయినా సిద్ధపడతాడు. కానీ ఆ తప్పేంటో ట్రైలర్‌లో రివీల్ చేయలేదు.
Also Read: అందులో తగ్గేదేలే అంటున్న స్వీటీ.. యాక్షన్, ఛేజింగ్ సీక్వెన్స్ లో హీరోలకు మించి..!
పచ్చి అబద్ధం
అలా ‘డ్రాగన్’ ట్రైలర్ అంతా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) జీవితకథ చుట్టే తిరుగుతుంది. అందులో గౌతమ్ మీనన్ కూడా ఒక గెస్ట్ రోల్ చేశారని ట్రైలర్‌లోనే రివీల్ అయ్యింది. ‘‘చక్కగా చదువుకొని, మంచి అబ్బాయిలాగా ఉంటే అమ్మాయిలకు నచ్చుతుంది అంటారు కదా అదంతా పచ్చి అబద్ధం’’ అనే డైలాగ్‌తో ఈ మూవీ ట్రైలర్ ఎండ్ అవుతుంది. మొత్తానికి ‘డ్రాగన్’ ట్రైలర్ మాత్రమే కాదు.. సినిమాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుపమతో పాటు కాయాదు లోహర్ కూడా మరొక హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేరోజు విడుదల కానుంది ఈ సినిమా.