Drinker Sai Movie : ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఎంత గొప్ప విషయమో. అదే సినిమాని ప్రజల మధ్యకు తీసుకెళ్లడం అనేది కూడా అంతే గొప్ప విషయం. కొన్ని అద్భుతమైన సినిమాలు కరెక్ట్ టైంలో మంచి ఆదరణకు నోచుకోవు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అరే ఇంత మంచి సినిమాను థియేటర్లో మిస్ అయ్యామా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్ళాలి తెలియాలి అంటే ఆ సినిమా టీం కి ఒక పెద్ద సపోర్ట్ ఉండాలి. అంతేకాకుండా ఆ సినిమా వెనక ఒక పెద్ద హీరో ఉండాలి. అందుకే ఇండస్ట్రీలో జరిగే చాలా సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న బిజీ షెడ్యూల్ వలన అన్ని సినిమాలకు ఆయన రాకపోవచ్చు.
ఇంకొంతమంది సినిమాను ప్రమోట్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకుంటారు. ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే పని చేశారు ఒక చిత్ర యూనిట్. డ్రింకర్ సాయి అనే చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైవిద్యంగా ప్లాన్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కటౌట్ ను, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజసాబ్ కటౌట్ తీసుకొచ్చారు. అయితే చీఫ్ గెస్ట్ గా వీళ్ళు రాలేదు కాబట్టి మేము వీళ్లకు చాలా పెద్ద అభిమానులమంటూ రెండు కటౌట్లను పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపించారు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ ఇద్దరు స్టార్ హీరోలకి ఎంతటి క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే థియేటర్ వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంటుంది.
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) December 9, 2024
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “డ్రింకర్ సాయి” సినిమా రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “డ్రింకర్ సాయి” టీజర్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘బాగి బాగి..’ లిరికల్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
Also Read : Srikanth Vissa: సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన పుష్ప రైటర్