Ram Charan Sukumar Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత చాలామంది తెలుగు దర్శకులు మూసలో వెళ్ళిపోకుండా సుకుమార్ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేశాడు. చేసిన ప్రతి సినిమాలోని సుకుమార్ సిగ్నేచర్ కనిపిస్తుంది. సుకుమార్ సినిమాలంటే చాలా క్వాలిటీ గా ఉంటాయని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వం వహించే చాలా సినిమాల్లో హీరోలు ఇంటిలిజెంట్ గా కనిపిస్తారు. అలానే ఆ సినిమాలో ఐటెం సాంగ్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక వరుసగా సినిమాలు చేసిన సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఆ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు.
బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది పొలిటీషియన్స్ స్పోర్ట్స్ మెన్స్ ఈ సినిమాలోని డైలాగ్స్ ను విపరీతంగా వాడారు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందువల్లనే రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా విపరీతమైన కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. అతి త్వరగా వెయ్యికోట్లు వసూలు చేసే సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ లో తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ పరిచయం చేశాడు సుకుమార్.
Also Read : Baby John Trailer: పోలీస్‌గా వరుణ్ ధావన్ ఉగ్రరూపం.. అదేంటి ‘జవాన్’ను మళ్లీ చూసినట్టుంది!
అయితే సుకుమార్ డైరెక్షన్ టీంలో నెక్స్ట్ డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు శ్రీకాంత్ విస్సా. శ్రీకాంత్ పుష్ప సినిమా రైటింగ్ విషయంలో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ మాటను స్వయంగా సుకుమార్ ఆన్ స్టేజ్ పై చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా శ్రీకాంత్ ను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు కొంతమంది మీడియా ప్రముఖులు. ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమాకి సంబంధించి కొంతమేరకు మాత్రమే నాతో సుకుమార్ గారి డిస్కస్ చేశారు. దానికి ఇంకా టైం పడుతుంది. ఇదివరకే ఈ సినిమాలోని ఎంట్రీ సీన్ గురించి ఎస్ ఎస్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పుడు రాజమౌళి చెప్పిన మాటలు, ఇప్పుడు శ్రీకాంత్ చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకుంటే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అర్థమవుతుంది.
Also Read : Manchu Manoj: మరి కొద్ది సేపట్లో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్..