Tollywood Movies: టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని మూవీలు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. నిజానికి బాక్సాఫీస్ దగ్గర ప్రతి శుక్రవారం ఓ సినిమా రిలీజ్ కావడం కామన్. ప్రేక్షకులను తమ కథతో అలరించేందుకు తెలుగు హీరోలు ప్రయత్నిస్తుంటారు. అటు డబ్బింగ్ సినిమాలు కూడా అడపాదడపా బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్నాయి.. వచ్చేవారం అంటే మార్చి 7 న కేవలం డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. తెలుగు బాక్సాఫీస్ దగ్గర కేవలం డబ్బింగ్ సినిమాలే సందడి చేయబోతున్నాయి. ఆ డబ్బింగ్ మూవీస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఫిబ్రవరి లో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక తండేల్ తప్ప ఏ మూవి అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘ఛావా’ చిత్రం ముందు వరుసలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ తో హిందీ మూవీని తెలుగులో రిలీజ్ డబ్ చేసేందుకు అన్ని కంప్లీట్ చేసుకుంది. విక్కీ కౌశల్, రష్మిక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాతో పాటు తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ నటించిన కింగ్‌స్టన్’ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. పూర్తి ఫాంటసీ హార్రర్‌గా రానున్న ఈ సినిమాను కమల్ ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్నారు. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి..
Also Read :తగ్గిన ‘ మజాకా ‘ జోరు.. టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమేనా..?
అదే విధంగా చివరగా మలయాళం నుంచి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ కూడా తెలుగు డబ్బింగ్‌తో మార్చి 7న రానుంది. ఈ సినిమాలో ప్రియమణి, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. వైవిధ్యమైన కథలతో మూడు డబ్బింగ్ సినిమాలు మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో తెలుగు ఆడియన్స్ ఏ మూవీకి మంచి మార్కులు వేస్తారో చూడాలి..
వీటితో పాటు మార్చిలో స్టార్ హీరో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా ఉంది. ఈ మూవీ షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉండడంతో వాయిదా పడే అవకాశం ఉందని ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడతారో చూడాలి.. ఏది ఏమైనా సంక్రాంతి తర్వాత సమ్మర్ మూవీల పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. చిరు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి..