BigTV English

Dubbing Janaki: ఆ హీరోయిన్ కి పొగరెక్కువ.. నన్ను అంటరాని దాన్ని చేసింది అంటున్న డబ్బింగ్ జానకి

Dubbing Janaki: ఆ హీరోయిన్ కి పొగరెక్కువ.. నన్ను అంటరాని దాన్ని చేసింది అంటున్న డబ్బింగ్ జానకి

Dubbing Janaki: దాసరి జానకి.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ డబ్బింగ్ జానకి (Dubbing Janaki) అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె.. డబ్బింగ్ ఎక్కువగా చెప్పడం వల్ల ఆ పేరుని ఇంటిపేరుగా మార్చుకొని, డబ్బింగ్ జానకిగా చలామణి అవుతున్నారు. ఈమె ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురం కి చెందినవారు. ఏడవ తరగతి వరకు చదువుకున్న జానకి.. మిలిటరీలో పనిచేస్తున్న తన ఊరికే చెందిన వ్యక్తిని ప్రేమించి మరీ ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి వెళ్లి అక్కడ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన జానకి, అక్కడే సినిమాలలో ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఇక ఈమె భర్త మిలిటరీ కావడంతో ఇద్దరు కొడుకులు, కూతురు బాధ్యత ఎక్కువగా ఈమె తీసుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, తాను పడిన అవమానాలు అన్నింటిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడ్డారు.


నేను తిన్నానని ఆ నటి భోజనాన్ని కాలితో తన్నింది – డబ్బింగ్ జానకి..

సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో జరిగే చేదు అనుభవాల గురించి డబ్బింగ్ జానకి చెబుతూ.. గతంలో షూటింగ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇచ్చే వెసులుబాటు ఉండేది కాదు. ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులకి కలిపి ఒకే గది ఇచ్చేవారు. అలా ఒక నటితో నేను కలిసి గది పంచుకున్నప్పుడు.. నా షూటింగ్ అయిపోయి భోజనం సమయానికి నేను గదికి వెళ్ళిపోయాను. కానీ నాతోపాటు ఉన్న నటి రాకపోయేసరికి నేను భోజనం చేసి పడుకున్నాను. ఆమె మాత్రం పేకాట ఆడి, కబుర్లు చెప్పి లేటుగా వచ్చి భోజనం క్యారేజ్ చూసి , ఆమె తిని మిగిల్చిన భోజనం నేను తినాలా అంటూ భోజనాన్ని కాలితో తంతే.. అది కాస్త నేల మీద పడి, అన్నం కూరలన్నీ పడిపోయాయి. అయితే అంత జరిగినా నేను స్పందించలేదు. అక్కడ నాకేం నష్టం జరగలేదు. నేను అన్నం తిని పడుకున్నాను. కానీ ఆమె ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వచ్చింది. కానీ ఒకరకంగా నన్ను అంటరాని దాన్ని చేసింది” అంటూ ఎమోషనల్ అయింది జానకి. ఇదే విషయాలపై ఆమె మాట్లాడుతూ..


ఎదగాలంటే ఒదగాల్సిందే….

ఇలాంటి విషయాలు ఎన్నో జరిగాయి కానీ నేను ఏవి పట్టించుకోను అని చెప్పింది. అయితే ఆ నటి ఎవరు అని అడిగితే ఆ ఒక్కటి అడగవద్దు అంటూ తప్పించుకున్నారు జానకి. ప్రస్తుతానికి జానకి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. డబ్బింగ్ జానకి విషయానికి వస్తే.. చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మొన్నటి వరకు కూడా క్యారెక్టర్ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఏదేమైనా ఇలా ఇండస్ట్రీలో అవమానాలు ఎదుర్కొని నిలదొక్కుకొని ఇంతటి పేరు సంపాదించుకోవడం అంటే నిజంగా మామూలు విషయం కాదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఓర్పు, సహనం చాలా అవసరమని, అవి ఉంటే అందలం ఎక్కువచ్చని ఇలాంటివారు ఉదాహరణగా నిలుస్తున్నారు అని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×