BigTV English

Balakrishna : బాలయ్య లవ్ స్టోరీ… ఇదేందయ్యా తట్టుకోగలమా..?

Balakrishna : బాలయ్య లవ్ స్టోరీ… ఇదేందయ్యా తట్టుకోగలమా..?

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ, ఈ సంవత్సరం ‘డాకు మహారాజ్’ తో వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత అఖండ 2 ని లైన్ లో పెట్టారు బాలకృష్ణ. ఇప్పటికే ఆ చిత్రం 50% షూటింగ్ కి పూర్తి చేసుకుంది.ఈ అక్టోబర్  కు అఖండ 2 రిలీజ్ చేయాలనీ మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు . ఈ సినిమా తరువాత, బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ దగ్గరకు డైరెక్టర్స్ కథలను తీసుకువెళ్లిన ఆయన ఏ కథకు ఓకే చెప్పలేదు. దానికి కారణం ఏంటన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


బాలయ్య అంటేనే మాస్ ..

నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ కు పెట్టింది పేరు. ఆయన అభిమానులంతా ఆయన నుండి మాస్ యాంగిల్ ని మాత్రమే కోరుకుంటారు. ఐదు సంవత్సరాలుగా వచ్చిన ప్రతి సినిమా 100 కోట్లు రాబట్టడం బాలయ్య కె సాధ్యమని చెప్పొచ్చు. బాలయ్య సినిమా అంటేనే పక్కా హిట్ అనే నమ్మకం. అఖండ నుంచి మొదలైన హిట్స్ ఇప్పటికి వరుసగా అందుకుంటూనే ఉన్నారు. ‘భగవత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ దాకా కొనసాగుతూ వచ్చింది. ఓక సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమా ఓకే చెప్పేస్తుంటారు బాలకృష్ణ. అయన కోసం గోపీచంద్ మలినేని ,హరి శంకర్ లాంటి డైరెక్టర్ లు కధలను సిద్ధం చేసిన, ఇంతవరకు బాలకృష్ణ ఓకే చెప్పలేదు. దానికి కారణం వారు లవ్ స్టోరీ తో ఆయనను కలిసినట్టు ఆయన నో చెప్పినట్టు సమాచారం .


అన్ని కుదిరితే ఆ డైరెక్టర్ తోనే ..

మాస్ హీరోగా ఇమేజెస్ సొంతం చేసుకున్న బాలకృష్ణ . ఇప్పుడు లవ్ స్టోరీలు వద్దు, అని మాస్ స్టోరీలతోనే తన ముందుకు రావాలని డైరెక్టర్లకు చెప్తున్నట్లు సమాచారం. అయితే అన్నీ కుదిరితే హరీష్ శంకర్ తో సినిమా చేస్తారని టాక్. హరిశంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. అది కొంత ఆలస్యం అవుతుందని, బాలకృష్ణ కథ పై ఫోకస్ చేసినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వయసుతో సంబంధం లేకుండా బాలకృష్ణ సినిమాలు చేస్తున్నాడు విశేషం. ఈ వయసులో కూడా ఆయన డాన్స్, ఫైటింగ్స్ తో సినిమాకు తనదైన ముద్ర వేస్తారు. సినిమా హిట్ ,ప్లాప్ అన్నది సర్వసాధారణం. కానీ బాలయ్య వరుసగా హిట్టు కొడుతూనే ఉన్నాడు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది.అయితే బాలకృష్ణ లవ్ స్టోరీలు వద్దు మాస్ సినిమాలే ముద్దు అని అనడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలయ్య మాస్, ఊర మాస్ అంటూ సోషల్ మీడియాలో బాలయ్య నిర్ణయానికి జై కొడుతున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ సినిమా అంటేనే, ఆయన అభిమానులతో పాటు ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. త్వరలోనే ఆయన ఫాన్స్ కు ,మంచి పండగ లాంటి వార్త చెప్తారని, ఆయన తీయబోయే నెక్స్ట్ సినిమా గురించి ,అప్డేట్ ఇస్తారని అభిమానులతో పాటు మనము ఆశిద్దాం..

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×