Jack Trailer :యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన యూట్యూబర్ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తాజాగా వస్తున్న చిత్రం జాక్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ టీజర్ పాట అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ఏప్రిల్ రెండవ తేదీన విడుదల చేస్తామని రెండు రోజుల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది కానీ చెప్పిన టైంకి మాత్రం రిలీజ్ చేయలేదు. ఇక ఉదయం రాలేదు కాబట్టి కనీసం సాయంత్రం ట్రైలర్ కోసమైనా సిద్ధంగా ఉండండి అంటూ ఫ్యాన్స్ ని కూడా ఎగ్జాక్ట్ చేశారు అటు నిన్న సాయంత్రం కూడా ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు పూర్తి నిరాశ వ్యక్తం చేశారు.
జాక్ సినిమా ట్రైలర్.. అదరగొట్టేసిన సిద్ధు
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. డ్రగ్స్ మేనియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ చాలా సరికొత్త యాంగిల్ లో కనిపించారు. టెర్రరిస్ట్ ముఠాలను అంతమొందించే సీక్రెట్ ఏజెంట్ తరహాలో సిద్దు మనకు కనిపించడం జరిగింది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ , వైష్ణవి చైతన్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా యూత్ ను బాగా ఆకట్టుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ఓవరాల్ గా సినిమా చాలా కొత్తగా భిన్నంగా అనిపిస్తోంది కానీ ఇందులో బూతులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి దీనిపై సెన్సార్ ఏదైనా కట్ విధిస్తుందో లేదో చూడాలి. ఇందులో ప్రకాష్ రాజ్ (Prakash Raj), వికే నరేష్ (VK Naresh) తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సక్సెస్ గ్యారెంటీ..
ఇకపోతే ఇందులో సిద్ధు జొన్నలగడ్డ చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు సమయానికి తగ్గట్టుగా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్లగా.. ఇంటర్వ్యూ చేసేవారు నీ బ్లేజర్ ఎక్కడ అంటే.. ఓహో ఇంటర్వ్యూ బ్లేజర్ కా.. నాకు కాదా అంటూ చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో ఈలలు తెప్పిస్తాయి. ఇకపోతే ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై సినిమా విడుదల అయ్యే వరకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అటు కామెడీ , ఇటు సస్పెన్షన్, మరొకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో ఓవరాల్ గా సిద్ధూ జొన్నలగడ్డ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోబోతున్నారని చెప్పాలి. మొత్తానికైతే సమ్మర్ స్పెషల్ గా రాబోతున్న ఈ సినిమాతో సిద్దు సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
సరికొత్త గా మారిన సిద్ధు.. కానీ అవేం మారలేదు..
డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ అంటూ సిద్ధు ను అలా చూశాం.కానీ ఇప్పుడు ఈ సినిమాలో టెర్రరిస్ట్ లు, మిషన్స్ అంటూ సిద్ధు జొన్నలగడ్డ కొత్తగా కనిపిస్తున్నాడు. కానీ, ఆ బూతులు, రొమాన్స్, కిస్ లు మాత్రం ఏం మారలేదు.