BigTV English

Kaantha: కాంత.. లక్కీ భాస్కర్ మరో హిట్ కొట్టేలా ఉన్నాడే..

Kaantha: కాంత.. లక్కీ భాస్కర్ మరో  హిట్ కొట్టేలా ఉన్నాడే..

Kaantha: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దుల్కర్ సల్మాన్. మొదట పరాజయాలను చవిచూసినా కూడా అధైర్యపడకుండా  కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో మహానటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆ తరువాత సీతారామం సినిమా అతడిని తెలుగువాడిగా మార్చేసింది. ఆ సినిమా తరువాత దుల్కర్ ఏ సినిమా చేసినా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తుంది.


ఇక గతేడాది లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్న దుల్కర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన  భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పూజా పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక నేటితో దుల్కర్ ఇండస్ట్రీలో 13 ఏళ్ళను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా కాంత సినిమా నుంచి దుల్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు  తెలిపారు. పోస్టర్ లో దుల్కర్ చాలా సీరియస్ లుక్ లో కనిపించాడు. కాంత  1950 నేపథ్యంలో సాగే కథ అని మేకర్స్ ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దుల్కర్ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సూట్ వేసుకొని.. చేతిలో కర్రతో చాలా సీరియస్ గా చూస్తూ కనిపించాడు దుల్కర్. ఇక ఈ పోస్టర్ ను  షేర్ చేస్తూ అభిమానులకు థాంక్స్ చెప్పాడు.


Identity: న్యూ*డ్ వీడియోలతో బ్లాక్ మెయిల్.. టాప్ రేటింగ్ లో త్రిష మూవీ

టైమ్‌లెస్‌ స్టోరీలో టైమ్‌లెస్‌ రోల్‌ నేను చేయవలసి వచ్చింది. ఇండస్ట్రీలో నా 13 ఏళ్లను జరుపుకోవడానికి ఇంతకంటే పెద్ద బహుమతిని అడగలేను. కాంత టీమ్ మొత్తానికి మరియు ఏ నటుడైనా కలలు కనే  ప్రేమ, ప్రోత్సాహాన్ని నాకు అందించిన అద్భుతమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

తెలుగువారు అయితే లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ ఎలాంటి సినిమా చేస్తాడా.. ? అని ఎంతగానో ఎదురుచూసారు. ఆ సమయంలోనే కాంతను అనౌన్స్ చేశారు. ఇక ఇలాంటి కథను మునుపెన్నడూ దుల్కర్ చేసింది లేదు. దీంతో మొదటి నుంచే సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ఈ పోస్టర్  తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఇక కాంత కాకుండా దుల్కర్ నటిస్తున్న మరో సినిమాలో ఆకాశంలో ఒక తార. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.  2023 లో దయ వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ చాలా గ్యాప్ తరువాత దుల్కర్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో దుల్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×