CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం, ప్రధాని దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లారు. నగరంలో ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ చెప్పారు.
‘ఫేజ్-1 లో 69 కిలోమీటర్ల దూరంతో మూడు కారిడార్లు ఉన్నాయి. ఫేజ్-I ప్రాజెక్ట్‌ను రూ.22,000 కోట్లతో నిర్మించారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉంది. గత 10ఏళ్లలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి విస్తరణ చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-II విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించింది.ఫేజ్-IIలో 5 కారిడార్లు ఉన్నాయి. దీని మొత్తం డిస్టాన్స్ 76.4 కిలోమీటర్లు. ఇది కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ప్రాజెక్ట్. మొత్తం ఖర్చు రూ. 24,269 కోట్లు అవుతోంది. ఇందులో కేంద్రం వాటా 18% కాగా.. రాష్ట్రం వాటా 30%. 48 శాతం రుణం ద్వారా నిధులను సమకూర్చనున్నారు.
2024 అక్టోబరులో చెన్నై మెట్రో ఫేజ్-IIకు రూ. 63,246 కోట్లు, 2021 ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-II కోసంరూ. 14,788 కోట్లు, 2024 ఆగస్టులో బెంగళూర్ మెట్రో ఫేజ్-IIIకు కోసం మళ్లీ రూ. 15,611 కోట్లు ఆమోదం తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2025, నవంబరు 4న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది. వాటిపై కేంద్రం కొన్ని అభ్యంతరాలు తెలపగా.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కోసం నిధులు సమకూర్చవల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని కోరారు.
II. ప్రాంతీయ రింగ్ రోడ్
హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్) తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం: సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ (ఎన్‌హెచ్ 161), ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం: చౌటుప్పల్ – అమన్‌గల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి (ఎన్‌హెచ్ 65), ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం కోసం భూముల సేకరణ సంబంధించిన పనులు 2022లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. భూ సేకరణ వ్యయంలో రాష్ట్రం 50 శాతం భరిస్తోంది. 90% భూముల ప్రపోజల్స్ NHAIకి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఎన్‌హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. ఈ భాగానికి అవసరమైన నిధుల కోసం కేబినెట్ ఆమోదం ఇవ్వండని సీఎం ప్రధానిని కోరారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని ఏక కాలంలో చేపట్టాలని చెప్పారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వృద్ధితో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడున్న ORR రానున్న 5 సంవత్సరాల్లో సరిపోదు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అందువల‌్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తేనే సరైన ఉపయోగం ఉంటుందని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కిమీ పరిధిలో రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సింగా ప్రతిపాదించారు. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుంది. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాల్సిందిగా కోరారు. దేశంలో 35 శాతం ఔషధాలను తెలంగాణ రాష్ట్రమే ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. బందరుపోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందని అన్నారు. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు.
III. సెమీకండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వండి..
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో AMD, Qualcomm, NVIDIA వంటి R&D కేంద్రాలు ఉన్నాయి. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ISM ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలపండి. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుంది. 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుంది.
ALSO READ: NTPC Limited: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.2,00,000 జీతం
IV. రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి..
హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని DRDO, డిఫెన్స్ PSUలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయి. వాటి పరిధిలో 1,000కి పైగా MSMEలు – స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయి. Lockheed Martin, Boeing, GE, Safran and Honeywell వంటి సంస్థలు హైదరాబాద్ పై ఆసక్తి చూపుతున్నాయి. రక్షణ రంగంలోని JVs & Offsetలకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరం. ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ALSO READ: Rain Alert: ఈ నెల 29 వరకు అతిభారీ వర్షాలు.. పిడుగులతో కూడిన వర్షం, ఈ జిల్లాల వారు జాగ్రత్త!
హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రతిపాదన:
UP, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రోత్సాహం ఉంది, కానీ హైదరాబాద్‌కి లేదని సీఎం రేవంత్ అన్నారు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలి.రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో నిర్వహించాలని అన్నారు. MSMEలకు ప్రోత్సాహకాలు, పీఎల్ఐ లాంటి మద్దతులు ఇవ్వాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.