Eesha Rebba: తెలుగు అందం ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతముందు ఆ తర్వాత సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.. ఈమె తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ చిత్రాల్లో కూడా నటించి పాపులర్ అయ్యింది. కానీ ఏ ఒక్క మూవీ కూడా సక్సెస్ టాక్ ను అందివ్వలేదు. ఇప్పటికి ఫెమస్ అవ్వలేక పోతుంది.. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో తన జీవితంలో జరిగిన విషాద ఘటన గురించి బయట పెట్టారు. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈషాకు ధైర్యం చెబుతున్నారు. ఇంతకీ ఆ విచార ఘటన ఏంటో తెలుసుకుందాం..
ఇంటర్వ్యూలో ఎమోషనలైన ఈషా..
తెలుగమ్మాయి ఈషా ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.. హీరోయిన్లకు పోటీగా అందంగా ఉన్నా కూడా ఆమెకు ఆఫర్స్ ఎక్కువగా రావడం లేదన్న విషయం తెలిసిందే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినీ జర్నీ గురించి అందరితో పంచుకుంది. అలాగే తన జీవితంలో తాను ఎదుర్కొన్న అత్యంత విషాదకర ఘటన గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన తల్లి చనిపోయిన ఘటన తనకు ఎంతో భాధను కలిగించిందని చెప్పింది.. డయాబెటిస్తున్న మా అమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం కానీ అప్పటికే డాక్టర్ ఆమెకు హాట్ స్ట్రోక్ వచ్చేసిందని ఎక్కువ రోజులు బతకడానికి చెప్పడంతో నేను చాలా క్రుంగి పోయాను. ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇప్పటికీ ఆమె మరణం నా కళ్ళ ముందరే కనిపిస్తుంది మా అమ్మని అంతగా ఇష్టపడ్డాను ఆమె చనిపోయింది అన్న విషయాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేక పోతున్నాను. అమ్మ చనిపోయినప్పుడు అమ్మాయిలు దగ్గర ఉండకూడదని అందరూ ఉన్నారు కానీ మా అమ్మని వదిలేసి ఉండాలి అనిపించలేదు చితివరికి వెళ్లి ఆమె పూర్తిగా దహనం అయ్యేంతవరకు నేను అక్కడే ఉన్నాను ఇది నిజంగా ఎంత బాధాకరంగా ఉండేదో నాకు మాత్రమే తెలుసు అని ఎమోషనల్ అయింది. తన తల్లి పై తనకున్న ప్రేమను చూసి నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
సినిమాల విషయానికొస్తే..
ఈ తెలుగు అమ్మాయి కావడంతో ఈ బ్యూటీని ప్రేక్షకులు అతి తక్కువ సమయంలోనే ఆదరించారు. తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. బందిపోటు, దర్శకుడు, అమీ తుమీ, ఆ!, బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, రాగల 24 గంటల్లో లాంటి అనేక సినిమాలలో నటించింది. అందులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఆమెకు మంచి సక్సెస్ ని ఇచ్చాయి ఆ తర్వాత అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవని చెప్పాలి. ప్రస్తుతం తమిళ్ చిత్రాలతో పాటు తెలుగులో కొన్ని సినిమాలు చేస్తుందని చెప్పింది త్వరలోనే వాటి గురించి ప్రకటిస్తానని ఆ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు..