TFCC Elections : తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో వివాదాలన్నీ కూడా ఓ కొలక్కి వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఫిల్మ్ ఛాంబర్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. అందుకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలల నుంచి ఫిల్మ్ ఛాంబర్‌లో వస్తున్న వివాదాలు అన్నీ కూడా సద్దుమణిగిపోయే అవకాశం కనిపిస్తుంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గా దిల్ రాజు రిలీవ్ అయిన తర్వాత ఆయన స్థానంలో భారత్ భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ఈ నెల 30తో వారి పదవీ కాలం కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పదవీ కాలం గురించి గత కొన్ని నెలలుగా ఫిల్మ్ ఛాంబర్‌లో రచ్చ నడుస్తూనే ఉంది.
వివాదానికి కారణం..
తన పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు పొడగించాలని భారత్ భూషణ్‌తో పాటు మరి కొంత మంది పట్టుకుని కూర్చున్నారు. దీన్ని మరో నిర్మాత స్రవంతి రవి కిషోర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై అవసరం అయితే హై కోర్టు కూడా వెళ్లడానికి సిద్ధమంటూ కామెంట్స్ చేశారు.
దీంతో ఛాంబర్ రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర రాయకీలాను తలపించే ఎపిసోడ్స్ కూడా జరిగాయి. అలాగే ఈసీ మీటింగ్స్ వివాదానికి తెరలేపాయి.
నిన్న తిరుపతిలో ఈసీ మీటింగ్..
ఛాంబర్‌లో ఈసీ మీటింగ్స్‌పై చర్చ పెద్దగానే జరిగింది. రెండు నెలల క్రితమే ఈసీ మీటింగ్ తిరుపతిలో జరిగింది. మళ్లీ ఈసీ మీటింగ్ తిరుపతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడాన్ని చాలా మంది తప్పు పట్టారు. అయితే హైదరాబాద్ లో మీటింగ్ జరిగితే, ఛాంబర్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉందని, అందుకే మళ్లీ ఈసీ మీటింగ్ ను తిరుపతిలోనే నిర్వహించాలని చూస్తున్నారు అంటూ కొంత మంది చెప్పుకున్నారు.
ఎలక్షన్స్ జరుగుతున్నాయి.. ఎప్పుడంటే ?
ఏది ఏమైనా ఈ వివాదాలకు అన్నింటికీ పులిస్టాప్ పడినట్టు అయింది. నిన్న తిరుపతిలో జరిగిన ఈసీ మీటింగ్‌లో పదవీ కాలం పొడగింపు, ఎలక్షన్స్ పై ప్రధానంగా చర్చ జరిపారు. ఫైనల్‌గా భరత్ భూషణ్ పదవీ కాలం పొడగింపును ప్రతిపాదనకు ఈసీ మీటింగ్‌లో ఎవరూ సపొర్ట్ చేయలేదు.
దీంతో ఎలక్షన్స్ అనివార్యం అయ్యాయి. అతి త్వరలోనే ఈసీ నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.