HBD Kiara Advani: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి కియారా అద్వానీ (Kiara Advani)ఒకరు. జూలై 31వ తేదీ తన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈమెకు పుట్టినరోజు(Birth day) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే నేడు కియారా పుట్టినరోజు సందర్భంగా ఈమెకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra)ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇటీవల ఒక ఆడబిడ్డ (Baby Girl)జన్మించారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ తో పరిచయం ప్రేమ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
పార్టీలో సిద్దార్థ్ ను కలిసిన కియారా..
నటుడు సిద్దార్థ్ తో కియారా మొదటి పరిచయం ఎక్కడ జరిగింది అనే విషయం గురించి నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. లస్ట్ స్టోరీస్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత కరణ్ జోహార్ స్నేహితుడు అమృత్ పుట్టినరోజు వేడుక జరిగిందని అయితే ఈ వేడుకకు తనతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా,కియారా, విక్కీ కౌశల్, నేహా దుపియా వంటి వారందరూ కూడా హాజరయ్యారని తెలిపారు. అలా ఈ కార్యక్రమంలో సిద్దార్థ్, కియారా మొదటిసారి కలవడం ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈ పార్టీ తర్వాత వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారడమే కాకుండా ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
రూ. 40 కోట్ల నికర ఆస్తి…
ఇక సినిమాలలో నటిస్తూనే కియారా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా సినిమాలలోను, బ్రాండ్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఈమె సుమారు 40 కోట్ల రూపాయల వరకు నికర ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈమె గ్యారేజ్ లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ఆడి వంటి ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వార్ 2 సినిమా…
కియారా అద్వానీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్ 2 (war 2)సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. నేడు కియారా పుట్టినరోజు కావడంతో వార్ 2 సినిమా నుంచి ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. తెలుగులో భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టిన కియారా అనంతరం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల రాంచరణ్ తో కలిసి ఈమె మరోసారి గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
Also Read: Kingdom Film: కింగ్డమ్ సినిమాకు కేటీఆర్ కొడుకు రివ్యూ … విజయ్ రియాక్షన్ ఇదే!