Air : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా పేరు సాధించుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ను ఒక వేదికగా చేసుకొని అక్కడ నుంచి ఎదగడం మొదలు పెడుతున్నారు. అలా చాలామంది దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇచ్చిన దర్శకులలో సందీప్ రాజ్ ఒకడు. ముందుగా యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని వీడియోస్ చేసిన సందీప్ కలర్ ఫొటోస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఓటిటిలో ఈ సినిమా ఒక సంచలనం. ఈ సినిమా తర్వాత సందీప్ దర్శకుడుగా చేస్తున్న సినిమా మోగ్లీ. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
వివాదంలోకి చిక్కుకున్నాడు
రీసెంట్ గా ఈటీవీలో ఎయిర్ అనే ఒక సిరీస్ విడుదలైంది. ఈ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ రెస్పాన్స్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో ఫ్యాన్ వార్స్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సిరీస్ కి సందీప్ రాజ్ ఒక నిర్మాతక వ్యవహరించాడు. కొన్ని క్యాస్ట్ కు సంబంధించిన డైలాగులు ఉండడంతో అందరూ సందీప్ రాజ్ నిందించడం మొదలుపెట్టారు.
చిరంజీవితో ఉన్న ఫోటోలు షేర్ చేసి కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
సందీప్ రాజ్ ఆవేదన
ప్రియమైన సోదరులారా,
2025 నాకు గొప్పగా ప్రారంభమైంది, డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రంలో భాగం కావడం ద్వారా. ట్వీట్ల పేరుతో నాకు లభించిన ప్రేమ, మరింత m పని చేయడానికి నాకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు ట్వీట్స్ నుండి మరియు అదే వ్యక్తుల నుండి ద్వేషాన్ని చూడటం ఖచ్చితంగా నా హృదయాన్ని బాధిస్తుంది.?
జనవరిలో నేను నిజంగా ఆ అభినందనలకు అర్హుడనా?
తెలియదు
జూలైలో నేను నిజంగా ఈ ద్వేషానికి అర్హుడనా?
స్పష్టంగా అవును
నేను విషయాలను కప్పిపుచ్చడానికి మరియు మేము చేసిన దానికి మద్దతు ఇవ్వడానికి ఇది చెప్పడం లేదు. ఒక చిత్రనిర్మాతగా నేను “ప్రేక్షకులు ఎల్లప్పుడూ సరైనవారు” అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే నమ్ముతాను. ఆ నిర్దిష్ట కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే. దానిలో భాగమైనందుకు నేను చాలా చింతిస్తున్నాను.
మేము అలానే తప్పు చేసాం
ద్వేషం లేదు, ప్రచారం లేదు మరియు నిర్దిష్ట సమాజం లేదా మతాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. మేము ఆ దృశ్యాన్ని తొలగించాము. ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ దశలలో తప్పులు చేస్తారు. మేము అదే చేసాము మరియు మేము దానిని వెంటనే సరిదిద్దుకున్నాము. మళ్ళీ చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. AIR అనేది అనేక మంది యువ ప్రతిభావంతులను వారి కెరీర్‌లపై ఆధారపడిన అభిరుచి నుండి రూపొందించబడింది.
కంటెంట్ విషయంలో బాధ్యతగా ఉంటా
ఇప్పటి నుండి కంటెంట్‌ను తయారు చేసేటప్పుడు నేను మరింత బాధ్యతాయుతంగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తున్నాను. మరియు ఈ వీక్ ఎండ్ లో మీ మనస్సులను కలవరపెట్టినందుకు క్షమించండి… నాపై మరియు నా బృందంపై మీ కోపాన్ని చల్లార్చడానికి అందమైన కంటెంట్‌తో దీనిని చాలా త్వరగా భర్తీ చేస్తాను. అంటూ తన పైన వస్తున్న నెగిటివిటీకి క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Big TV Kissik Talks : సూర్యతో చేసే సినిమా ఇదే, డీటెయిల్స్ చెప్పేసిన దర్శకుడు