Hit 3: తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాషలో అయినా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలతో తెరకెక్కిన సినిమాలు చాలావరకు సూపర్ హిట్‌గా నిలుస్తాయి. అందులో అలాంటి వరుస క్రైమ్ థ్రిల్లర్ కథలను కలిపి ఒక యూనివర్స్‌ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu). నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి శైలేష్‌ను దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ‘హిట్’ అనే సినిమాతో మొదటిసారి డైరెక్టర్‌గా ప్రేక్షకులను పలకరించిన తర్వాత అదే పేరుతో ఒక యూనివర్స్‌ను క్రియేట్ చేశాడు శైలేష్. ఇప్పటికే హిట్ యూనివర్స్ నుండి మూడు సినిమాలు విడుదల కాగా అందులో ప్రతీ సినిమా ఒక రియల్ క్రైమ్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండడం యాదృచ్ఛికం అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
అదే మొదటిసారి
ముందుగా హిట్‌వర్స్‌లో విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్ 1’ తెరకెక్కింది. అదే సమయంలో దిశా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక డాక్టర్‌ను కొందరు దుండగులు దారుణంగా రేప్ చేశారు. ఆపై తనను కాల్చి చంపేశారు. ఆ ఘటన జరిగిన కొన్నాళ్లకే ‘హిట్’ రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఆ మూవీలో కూడా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. కొన్నాళ్లకు తన కాలిన శవం పోలీసులకు దొరుకుతుంది. విశ్వక్ సేన్ ఒక పోలీసుగా ఈ కేసును చేధిస్తాడు. దిశా ఘటన జరిగిన కొన్నాళ్లకే ‘హిట్’ రిలీజ్ అవ్వడం అప్పట్లో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ‘హిట్ 2’ విషయంలో కూడా అదే జరిగింది. అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమానే ‘హిట్ 2’.
బాయ్‌ఫ్రెండే హంతకుడు
‘హిట్ 2’లో ఒక అమ్మాయి మిస్ అవుతుంది. తన బాయ్‌ఫ్రెండే తనను కిడ్నాప్ చేసి, హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తుంటారు. అలా మరికొన్ని వరుస హత్యలు కూడా జరుగుతుంటాయి. అయితే ఇది రీల్ స్టోరీనే కానీ ఈ సినిమా రిలీజ్‌కు కొన్నిరోజుల ముందే ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే అమ్మాయి హత్య జరిగింది. ఆ అమ్మాయిని తన బాయ్‌ఫ్రెండ్ దారుణంగా హత్య చేసి, ముక్కలుముక్కలుగా నరికేశాడు. అప్పట్లో ఈ కేసు ఒక సెన్సేషన్‌గా మారింది. కరెక్ట్‌గా ‘హిట్ 2’ రిలీజ్ అయ్యే కొన్నిరోజుల ముందే శ్రద్ధా వాకర్ ఘటన చోటుచేసుకుంది. ఇది రెండో యాదృచ్ఛికం. ఇక ‘హిట్ 3’ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది.
Also Read: పెరిగిన ‘హిట్ 3’ టికెట్ రేట్లు.. ఎంత పెంచారంటే.?
పహల్గమ్ ఘటన తరహాలో
‘హిట్ 3’ (Hit 3) సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు నాని (Nani). ఈ సినిమాను కశ్మీర్ లాంటి పాత్రల్లో తెరకెక్కించారు. ఇందులో టెర్రరిజం గురించి కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. మే 1న ‘హిట్ 3’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇటీవల పహల్గమ్‌లో జరిగిన అటాక్ ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. అయితే ఈ మూవీలో కూడా పహల్గమ్‌ను తలపించే ఒక ఘటన ఉంటుందని, దానిపై హీరో పోరాడతాడని డైరెక్టర్ రివీల్ చేయగానే ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. హిట్‌వర్స్‌లో ప్రతీ సినిమా విడుదలకు ముందు ఒక గుర్తుండిపోయే క్రైమ్ జరగడం మామూలు యాదృచ్ఛికం కాదని ఫీలవుతున్నారు.