BigTV English

Hit 3 Ticket Hike: పెరిగిన హిట్ 3 టికెట్ రేట్లు.. ఎంత పెంచారంటే..?

Hit 3 Ticket Hike: పెరిగిన హిట్ 3 టికెట్ రేట్లు.. ఎంత పెంచారంటే..?

Hit 3 Ticket Hike..హిట్ యూనివర్స్ లో భాగంగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం : హిట్ 3 : ది థర్డ్ కేస్’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులపై అంచనాలు పెంచేసాయి. ముఖ్యంగా మునుపెన్నడూ చూడని విధంగా నాని (Nani) ని ఈ సినిమాలో చూపించారు. అత్యంత క్రూరంగా, చాలా రాక్షసంగా అర్జున్ సర్కారుగా నాని ఇందులో కనిపించారు. ఇక మే ఒకటవ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి (Rajamouli) చీఫ్ గెస్ట్ గా రాబోతున్న విషయం తెలిసిందే.


పెరిగిన హిట్ 3 టికెట్ ధరలు..

ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు కూడా పెంచడం జరిగింది. సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు పెంచారు. ఈ ధరలు కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వర్తిస్తాయి. తెలంగాణలో టికెట్ ధరలు పెరగవు అని సమాచారం. మొత్తానికైతే అటు సింగిల్ స్క్రీన్ లలో , ఇటు మల్టీ ఫ్లెక్స్ లలో వందలోపే ధరలు పెంచి, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంచేలా టికెట్ ధరలు తీసుకొచ్చారు. ఇకపోతే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మాగంటి శ్రీనాథ్, రవి మరియా, బ్రహ్మాజీ, ఆదర్శ్ బాలకృష్ణ, రావు రమేష్, సూర్యా శ్రీనివాస్ , ఆదిల్ పాలా తదితరులు నటిస్తున్నారు.


also read;Mahesh Babu: ఈడీ విచారణ ఎగ్గొట్టిన మహేష్ బాబు… నెక్స్ట్ అరెస్టేనా..?

హిట్ ఫ్రాంచైజీలు..

హిట్ ఫ్రాంచైజీల విషయానికి వస్తే.. హిట్ : ది ఫస్ట్ కేస్ 2020 ఫిబ్రవరి 28న విడుదల అయ్యి, మంచి విజయాన్ని అందుకుంది. వాల్ పోస్టర్ సినిమా పతాకం పై నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మించగా.. శైలేష్ కొలను తొలిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక హిట్ 2 విషయానికి వస్తే.. అడవి శేషు హీరోగా మీనాక్షి చౌదరి, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2022 డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్లో నాని ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగానే హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు హిట్ 3 సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×