HBD Balakrishna..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ (Balakrishna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా బాలా బాబాయ్ కి స్పెషల్ విషెస్ తెలియజేయడం జరిగింది. తాజాగా కళ్యాణ్ రామ్ తన ఎక్స్ ఖాతా ద్వారా.. “హ్యాపీ బర్తడే బాబాయ్” అంటూ లవ్ సింబల్ ని కూడా జోడిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాబాయ్ – అబ్బాయ్ కలిసిపోయినట్టేనా?
గత కొన్ని రోజులుగా హరికృష్ణ (Harikrishna) వారసులుగా పేరు సొంత చేసుకున్న ఎన్టీఆర్ (NTR ), కళ్యాణ్ రామ్(Kalyan Ram) బాలకృష్ణకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి కళ్యాణ్ రామ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆయనకు అండగా నిలిచారు. ఇక తమ్ముడిని దూరం చేసుకోలేక అటు నందమూరి ఫ్యామిలీకే దూరమయ్యారు కళ్యాణ్ రామ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. వాస్తవానికి బాలకృష్ణకు ఎన్టీఆర్ మీదే కోపమని, ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ తో చేరడంతో ఇద్దరినీ దూరం పెట్టేశారు అని ఒక వర్గం నెటిజెన్స్ కామెంట్లు చేస్తుంటే.. అసలు ఎన్టీఆర్ కి ఎం బాలకృష్ణకి మధ్య విభేదాలే లేవు. కావాలనే కొంతమంది ఆంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారని మరో వర్గం నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
దీనికి తోడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఎన్టీఆర్ తనకు బాలా బాబాయి అంటే ఇష్టమని ఆయనకు తనకు విభేదాలు ఏంటి అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఎన్టీఆర్ – బాలయ్య మధ్య గొడవలు ఉన్నాయని, బాలయ్యకు ఎన్టీఆర్ అంటే నచ్చదని, ఇలా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కారణంగానే కళ్యాణ్ రామ్ ని కూడా బాలకృష్ణ దూరం పెట్టారు అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
also read: HBD Balakrishna: బాలకృష్ణ నటించిన చిత్రాలలో భార్య వసుంధరకు ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా..?
ఈసారైనా గెట్‌లోకి ఎంట్రీ ఉంటుందా?
ఇకపోతే ఇలా రోజు రోజుకి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ రామ్ స్పెషల్ విషెస్ చెప్పడంతో ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీలోకి కళ్యాణ్ రామ్ కి ఎంట్రీ ఉంటుందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కనీసం ఇక్కడితోనైనా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ , బాలకృష్ణ అందరూ కలిసి పోవాలని, నందమూరి ఫ్యామిలీ అంతా ఓకే ఫ్రేమ్లో కనిపిస్తే చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
అటు ఇప్పుడు బాలకృష్ణ కూడా తన కొడుకుల్ని తనలో చేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. మరి ఇప్పటికైనా ఆ ఫ్రేమ్ తెరపైకి వస్తుందేమో చూడాలి అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి పోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇదే చక్కనైన అవకాశం.. కచ్చితంగా ఈసారి గెట్ లోకి నందమూరి కళ్యాణ్ రామ్ కి ఎంట్రీ ఉంటుంది అంటూ కూడా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Happy Birthday Babai ❤️#HappyBirthdayNBK
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2025