Emmy Awards 2024 : 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2024 (International Emmy Awards 2024) నవంబర్ 25న న్యూయార్క్ హిల్టన్ మిడ్‌టౌన్ (యుఎస్)లో ఘనంగా నిర్వహించారు. రాత్రి జరిగిన ఈ అవార్డ్ ఫంక్షన్‌కి పలువురు టీవీ సెలబ్రిటీలు హాజరై ఈవెంట్‌ను గ్లామర్‌గా మార్చారు. ఎమ్మీ అవార్డ్స్ 2024ని భారతీయ స్టాండప్ కమెడియన్, నటుడు వీర్ దాస్ హోస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు వేడుకను భారతీయ కళాకారుడు నిర్వహించడం మనకు గర్వకారణం అని చెప్పవచ్చు. వీర్ దాస్ తన మొదటి ఎమ్మీ అవార్డును 2023లో గెలుచుకున్నాడు. ఆ తర్వాత షోను హోస్ట్ చేసే అవకాశం పొందాడు.
కాగా ఎమ్మీ అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (IAATAS) నిర్వహిస్తుంది. ఈసారి 14 విభాగాల్లో 21 దేశాల నుంచి 56 మంది ఆర్టిస్ట్ లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఎమ్మి నామినేషన్ లలో బెస్ట్ డ్రామా సిరీస్, కామెడీ, డాక్యుమెంటరీ, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఆర్ట్స్ ప్రోగ్రామింగ్, పిల్లల ప్రోగ్రామింగ్ తో పాటు మరిన్ని మరిన్ని విభాగాలు ఉన్నాయి. ఇక ఈ అవార్డులకు ఇండియా నుంచి అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూలిపాళ్ళ నటించిన ‘ది నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్ సిరీస్ విభాగంలో నామినేట్ అయ్యింది. కానీ ఈ సిరీస్ అవార్డును దక్కించుకోలేకపోయింది.
‘ది నైట్ మేనేజర్’ సిరీస్ ఎమ్మీ అవార్డ్స్ 2024లో అవార్డును తెచ్చి పెడుతుందని భారతీయ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సిరీస్ ఫ్రెంచ్ డ్రామా ‘లెట్స్ గాట్స్ డి డైయు’ (డ్రాప్ ఆఫ్ గాడ్)తో పోటీ పడింది. కానీ ‘ది నైట్ మేనేజర్’ అవార్డును మాత్రం తేలేకపోయింది. అయితే డిసెంబర్ లోనే నాగ చైతన్యతో శోభిత పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో ‘ది నైట్ మేనేజర్’ సిరీస్ ఎమ్మీ అవార్డ్స్ లో డిసప్పాయింట్ చేయడం ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.