BigTV English

Family Star: ఫ్యామిలీ స్టార్ పై మీమ్స్ వైరల్.. హీరోయిన్ డ్రెస్ పై ట్రోలింగ్..

Family Star: ఫ్యామిలీ స్టార్ పై మీమ్స్ వైరల్.. హీరోయిన్ డ్రెస్ పై ట్రోలింగ్..

Family Star: విజయ్ దేవరకొండ ఈసారి కమర్షియల్ గా ట్రై చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేస్తున్న సరికొత్త ఎక్స్పరిమెంట్ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ఎంతో ప్రామిసింగ్ గా ఉండడంతో పాటు.. ఇందులో విజయ్ దేవరకొండ లుక్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా వీడియో ఎండింగ్ లో కంగారులో కొబ్బరికాయ మర్చిపోయాను అందుకే తలకాయ కొట్టేసాను అనే విజయ్ దేవరకొండ డైలాగ్ మూవీ పై కాస్త పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే వీడియో అంతా పక్కన పెట్టి అందులో మృణాల్ ఠాకూర్ వేసుకున్న ఒక్క డ్రస్సు గురించి సోషల్ మీడియాలో రచ్చ.. రచ్చ చేస్తున్నారు.


ఫ్యామిలీ స్టార్ కి సర్కారు వారి పాట మూవీకి లింకు పెట్టేస్తున్నారు. కొత్తగా మూవీకి సంబంధించి ఏ వీడియో రిలీజ్ అయినా చాలు మీమర్స్ దాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడమే కాకుండా ఏ కాస్త పాయింట్ దొరికినా భూతద్దంలో పెట్టి అందరికీ చూపించేస్తారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ పరిస్థితి కూడా అదే. పరశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న రెండవ చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో గీతా గోవిందం వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటివరకు రౌడీ బాయ్ గా ,లవర్ బాయ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ ను మిడిల్ క్లాస్ హస్బెండ్ క్యారెక్టర్ లో ఫ్యామిలీ మ్యాన్ గా చూపిస్తున్నాడు పరశురాం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు కానీ అంతకంటే అట్రాక్టివ్ గా వ్యూయర్స్ కు మృణాల్ వేసుకున్న డ్రెస్ కనిపిస్తోంది. అబ్బా ఇందాకటి నుంచి డ్రెస్.. డ్రెస్ అంటున్నారు ఇంతకీ ఏంటీ ఈ డ్రెస్ గోల అనుకుంటున్నారా.. అదిగో అక్కడికే వస్తున్నా.


విషయం ఏమిటంటే.. సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్.. ఫ్యామిలీ స్టార్ టీజర్ ఎండ్ లో మృణాల్ ఠాకూర్ వేసుకున్న డ్రెస్ ఒకే లాగా ఉన్నాయి. టీజర్ ఎండ్ లో కేవలం ఒక సెకండ్ పాటు కనిపించే మృణాల్, విజయ్ ను వెనకనుంచి ఏమండీ అని పిలుస్తుంది. దానికి వెళ్తున్న విజయ్ స్టన్ అయి ఆగిపోతాడు. అయితే ఆ ఒక్క సెకండ్ కి ఆమె వేసుకున్న డ్రెస్ ని పట్టేశారు మన మిమర్స్. ఇక దాని పుట్టుపూర్వోత్తరాల గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు.

ట్రోలింగ్ చేయడానికి,మీమ్స్ క్రియేట్ చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికిన వదలని మన నెటిజెన్ల కు ఫ్యామిలీ స్టార్ టీజర్ మంచి ఛాన్స్ ఇచ్చింది. సర్కారు వారి పాట మూవీకి డైరెక్టర్ .. ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ ఇద్దరు పరుశురామే.. దీంతో పాత సినిమా హీరోయిన్ ల డ్రెస్సులను కొత్త సినిమాకి బలే రీ యూజ్ చేస్తున్నారే అంటూ మృణాల్ వేసుకున్న కాస్ట్యూమ్, కీర్తి సురేష్ వేసుకున్న కాస్ట్యూమ్ పోల్చి చూపిస్తూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. మరోపక్క రౌడీ స్టార్ అభిమానులు ఈ విషయంపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ట్రోల్స్ మూవీకి ఇంకా హైప్ పెంచుతాయి తప్ప ఎటువంటి నష్టం క్రియేట్ చేయలేవని చెప్పాలి.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×