BigTV English

Eye Sight: కళ్ల సంరక్షణ.. ఈ ఫుడ్ తింటే చూపు సూపర్..

Eye Sight: కళ్ల సంరక్షణ.. ఈ ఫుడ్ తింటే చూపు సూపర్..

Eye Sight: మనిషికి కంటిచూపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దృష్టిలోపం ప్రస్తుత సమాజంలో ప్రధాన సమస్యగా మారింది. దాన్ని నివారించాలంటే తగు జాగ్రత్తలు పాటించాల్సిoదే. ఏటా అక్టోబర్ రెండో గురువారం ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’నిర్వహిస్తాం. కంటి సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇవే కీలకం..
కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకు కూరలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్ సీ అధికంగా ఉండి కళ్లను కాపాడుతాయి.
కళ్ల ఆరోగ్యానికి తోడ్పడే తాజా పండ్లను సలాడ్ లేదా జ్యూస్‌ల రూపంలో తీసుకోవాలి.

ఇవి తప్పనిసరి..
సూర్యకిరణాల్లోని హానికారక ఆల్ట్రా వయోలెట్‌ కిరణాలు కంటిని గాయపరుస్తాయి. అందుకని బయటకు వెళ్లాల్సిన సమయాల్లో యూవీ సన్ గ్లాసెస్ ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సమయం గడిపి వారి కళ్లు పొడిబారుతుంటాయి. దీని నుంచి బయట పడటానికి ఎక్కువ సార్లు కళ్లు మిణకరించేలా చూడాలి. టీవీ, కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాస్‌లను ధరిస్తే కళ్లపై భారం పడదు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×