E-Paper
Advertisement

Family Star: సక్సెస్ కోసం లవర్ బాయ్ నుంచి ఫ్యామిలీ స్టార్ గా మారిన విజయ్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా?

Family Star: సక్సెస్ కోసం లవర్ బాయ్ నుంచి ఫ్యామిలీ స్టార్ గా మారిన విజయ్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా?
Advertisement

Family Star: కొద్ది కాలంగా సక్సెస్ కోసం ఏకధాటిగా ప్రయత్నిస్తున్న హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి చిత్రం ఊహించిన ఫలితాన్ని అందించ లేకపోయింది. దీంతో ఈ కుర్ర హీరో తన హోప్స్ మొత్తం రాబోయే నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్టు పై పెట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ సక్సెస్ ను గీతాగోవిందం మూవీ రూపంలో అందించిన డైరెక్టర్ పరశురామ్. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న నెక్స్ట్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ పక్కన హీరోయిన్ గా టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

రౌడీ బాయ్ గా తన అగ్రెసివ్ హీరోయిజం చూపించే ప్రయత్నం చేసి పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఫ్యామిలీ సెంటిమెంట్ ఓన్ చేసుకోవాలి అని విజయ్ భావించినట్లు ఉన్నాడు. అందుకే ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేశారు. లైగర్ దెబ్బకు డీలా పడ్డ విజయ్ దేవరకొండ ఖుషి పుణ్యమా అని కాస్త కోలుకున్నాడు అయితే ఊహించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో కనీసం ఈ చిత్రమైన అతన్ని తిరిగి నిలబెట్టాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.

Advertisement

మరోపక్క విజయ్ కూడా ఎలాగైనా ఫ్యామిలీ ఆడియన్స్ను తన బుట్టలో వేసుకోవాలని ఫ్యామిలీ స్టార్ గా అందరి ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ రివిల్ చేస్తూ కాసేపటి క్రితమే చిన్న టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో ఒక సగటు మధ్యతరగతికి చెందిన యువకుడిగా విజయ్ దేవరకొండ బాగానే సెట్ అయ్యాడు. మామూలుగా విజయ్ సినిమాల లో ఉన్నట్టు ఫాంటసీలు కాకుండా ఈ చిత్రంలో కాస్త స్టోరీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది.

పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు ,కూరగాయలు తేవడం దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్ కి డ్రాప్ చేసే ఒక మామూలు మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం అద్భుతంగా చూపించారు. తన పని తాను చేసుకుని గొడవలకు దూరంగా ఉంటున్న హీరోని చూసి కాస్త పిరికి మనస్తత్వం అని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా లోకల్ పంచాయతీ డాన్ పిలవడం.. ఆడవాళ్ళ పనులు చేసే వాడివి అంటూ ఎగతాళి చేయడం తో వీడియోలో కాస్త హీట్ మొదలవుతుంది. ఆ డాన్ మాటలకు సమాధానంగా హీరో ఇనుప రాడ్ ను చీపురుపుల్ల మాదిరి నిలువుగా వంచడమే కాకుండా ఆ రౌడీ తలను బద్దలు కొట్టి “అయ్యో సారీ కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను ..తలకాయ కొట్టేసాను “అంటూ తన స్టైల్ కౌంటర్ ఇస్తాడు.

Advertisement

టీజర్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ఒక్క డైలాగ్ ఒక ఎత్తు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకే ఒక డైలాగ్ తో అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే విధంగా హీరో క్యారెక్టర్ని డైరెక్టర్ పరుశురాం అద్భుతంగా తీర్చిదిద్దాడు. గీతా గోవిందం లో విజయ్ దేవరకొండ ను ఒక మంచి హస్బెండ్ మెటీరియల్ గా చూపించి సక్సెస్ సాధించిన అనుభవంతో ఈసారి అతని క్యారెక్టర్ ని మరింత బ్యాలెన్స్ చేస్తూ చిన్న సీన్ ని సీమ టపాకాయల పేల్చాడు. ఒక్క టీజర్ ఇలా ఉంది అంటే మూవీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కలగక మానదు. అయితే ఇందులో హీరోయిన్ ని కేవలం ఒకే ఒక ఫ్రేమ్ కి పరిమితం చేశారు. ఇద్దరు భార్యాభర్తలు అన్న క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి ఇది లవ్ స్టోరీ కంటే కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అని అర్థం అవుతుంది. ఈసారి సంక్రాంతికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడానికి ఫ్యామిలీ స్టార్ గా రావడానికి సిద్ధమవుతున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×