BigTV English

Shrasti Verma: కారు కొనుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ , జీవితాన్ని నాశనం చేసావ్ అంటూ ట్రోలింగ్

Shrasti Verma: కారు కొనుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ , జీవితాన్ని నాశనం చేసావ్ అంటూ ట్రోలింగ్
Advertisement

Shrasti Verma: టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు. అడుగడుగునా వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రతి సమస్యని క్లారిటీగా డీల్ చేసుకుంటూ అడుగులు వేయాలి. కొన్నిసార్లు మనకి ప్రమాదాలు జరుగుతుంటాయి, అలానే మన వలన కూడా వేరే వాళ్ళు ప్రమాదానికి గురవుతారు. ఈరోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆరోపణ వినిపిస్తే చాలు, ముందు నిజ నిజాలు గురించి చర్చించకుండా కొంతమంది చాలా విషయాలను డిసైడ్ చేసేస్తుంటారు. అటువంటి తరుణంలోనే ఆచితూచి అడుగువేయాల్సి వస్తుంది. ముఖ్యంగా శ్రష్ఠి వర్మ గురించి రీసెంట్ టైమ్స్ లో వినని వాళ్ళు ఉండరు. ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ తనమీద అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఈమె చేసిన విమర్శలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీవ్రమైన దుమారాన్ని రేపాయి. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నార్సింగ్ పోలీసులు ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్ ను అరెస్టు కూడా చేశారు.


పాన్ స్థాయిలో గుర్తింపు సాధించాడు

ఆ కొరియోగ్రాఫర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు ఉంది. దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టి తర్వాత డాన్సర్ గా మారి ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో చాలామంది స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. అటువంటి మాస్టర్ పైన ఈ ఆరోపణలు రావడం చాలామందికి నిరాశ కలిగించింది. ప్రస్తుతం ఆ మాస్టర్ తన ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. మరోవైపు ఈ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ కూడా కెరియర్ లో బిజీ అయిపోయింది. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడం ఆ సినిమా సక్సెస్ అవడం కూడా శ్రష్ఠి వర్మకి బాగా కలిసి వచ్చింది. స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తనకు న్యాయం చేస్తాను అని అప్పట్లో మాటిచ్చినట్లు వార్తలు కూడా వినిపిస్తూ వచ్చాయి.


Also Read : AA22xA6 : మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం, ఏం ప్లాన్ చేసావు అట్లీ.?

లేడీ కొరియోగ్రాఫర్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు. మొత్తానికి లేడీ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సాధించుకుంది శ్రేష్ఠి. ఒకవైపు కెరియర్ కూడా బాగా నడుస్తుండడంతో రీసెంట్ గానే తను ఒక కారును కొనుక్కుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చాలామందితో పంచుకుంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది తనకు కంగ్రాట్స్ చెప్తుంటే, మరికొంతమంది మాత్రం ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. జీవితాలతో ఆడుకున్నావంటూ కొంతమంది తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రష్ఠి కారు కొనుక్కున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Good Bad Ugly Box: బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్స్ వసులు చేసిన అజిత్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే??

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×