Preity Zinta : బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta) కు తాజాగా ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ స్టార్ హీరోను డేట్ చేశారా? అంటూ ప్రీతిని డైరెక్ట్ గా ప్రశ్నించాడు సదరు నెటిజన్. దీంతో పెళ్లయిన హీరోయిన్ కు ఇలాంటి ప్రశ్నలు ఏంటి ? అన్నట్టుగా అసహనాన్ని వ్యక్తం చేస్తూనే, అతనికి సెటైరికల్ గా రిప్లై ఇచ్చింది ప్రీతి జింటా.
తాజాగా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ (Salman Khan) పుట్టినరోజు సందర్భంగా ప్రీతి జింటా (Preity Zinta) విష్ చేస్తూ పోస్ట్ చేసింది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఒక నెటిజన్స్ ‘మీరిద్దరూ ఎప్పుడైనా డేట్ చేశారా?’ అని ప్రశ్నించారు. దీంతో షాక్ అయిన ప్రీతి జింటా సల్మాన్ ఖాన్ తనకు మంచి స్నేహితుడని, కుటుంబ సభ్యులతో సమానమని క్లారిటీ ఇచ్చింది. నెటిజన్ ప్రశ్నపై ప్రీతి జింటా స్పందిస్తూ “మేమిద్దరము ఎప్పుడూ డేట్ చేయలేదు. అతను నాకు కుటుంబ సభ్యుడితో సమానం. అంతేకాకుండా నా భర్తకు కూడా మంచి స్నేహితుడు. ఒకవేళ మీరు గనక నా సమాధానంతో ఆశ్చర్యానికి గురైతే క్షమించండి” అంటూ సెటైరికల్ గా సమాధానం చెప్పింది. దీంతో ప్రీతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పెళ్లయిన హీరోయిన్ కు ఇలాంటి ప్రశ్నలు వేయడమేంటి అంటూ ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta) 1998లో ‘దిల్ సే’ అనే సూపర్ హిట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తెలుగులో రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. 2018 లో రిలీజ్ అయిన ‘భయ్యాజీ సూపర్ హిట్’ సినిమా తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘లాహోర్ 1947’ అనే సినిమా కోసం పని చేస్తున్నారు. అయితే గతంలో సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడిగా పేరు తెచ్చుకుంది.
వీరిద్దరూ కలిసి ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ అనే సినిమాల్లో నటించారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి నటించిన పలు సినిమాలు హిట్ కాగా, ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. ఆ స్నేహం వల్లనే ప్రతి ఏడాది ప్రీతి జింటా (Preity Zinta) సల్మాన్ ఖాన్ బర్త్ డే రోజున స్పెషల్ గా విష్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది డిసెంబర్ 27న కూడా అలాగే పోస్ట్ చేసింది. సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు సల్మాన్.. లవ్ యూ మోస్ట్… మనిద్దరం కలిసినప్పుడు మిగతా విషయాలు చెప్తాను. మనిద్దరం కలిసి కొత్త ఫోటోలు దిగాలి. లేదంటే పాత ఫోటోలే ప్రతిసారి పోస్ట్ చేస్తూ ఉంటాను”అంటూ సరదాగా రాసుకొచ్చింది.