Redmi 14C 5G : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్ మీ.. త్వరలోనే రెడ్ మీ 14C మొబైల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక తాజాగా ఈ మొబైల్ లాంఛ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు లీకైన ఈ మొబైల్ ఫీచర్స్, ధర సైతం టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా Redmi Note 14 సిరీస్‌ను ప్రారంభించిన చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్ మీ.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. Xiaomi నుంచి వచ్చేస్తున్న Redmi 14C 5G ఫీచర్స్ ఇప్పటికే లాంఛ్ అయ్యి టెక్ ప్రియులను ఉర్రూతలూగించగా.. తాజాగా ఈ ఫీచర్స్ అధికారికంగా లాంఛ్ అయ్యాయి. మైక్రోసైట్ అధికారిక వెబ్ సైట్ లో రెడ్ మీ 14C మొబైల్ స్పెసిఫికేషన్స్ వెల్లడయ్యాయి. దీంతో ఈ మొబైల్ కెమెరా, డిస్ ప్లే, లాంఛ్ తేదీ తో పాటు ధర విషయం సైతం వెల్లడైంది.
Redmi 14C Features –
Redmi 14C మెుబైల్ డ్యూయల్ 5G SIM సపోర్ట్, 50MP ప్రైమరీ కెమెరాతో వచ్చేస్తుంది. Redmi 14C ధర రూ. 11,000 నుంచి రూ. 12,000 మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ మెుబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్ సెట్ తో రాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు 6.88 అంగుళాల LCD డిస్‌ప్లే కూడా ఉండే అవకాశం ఉంది.
లాంఛ్ తేదీ –
Redmi 14C జనవరి 6న భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలో లాంఛ్ అవుతుంది. ఈ మెుబైల్ Redmi 13C తర్వాత వస్తుంది కాబట్టి హార్డ్‌వేర్ పరంగా కొత్త డిజైన్, కొన్ని అప్‌గ్రేడ్‌లతో వస్తుందని తెలుస్తుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్టార్‌లైట్ థీమ్ ఉంటుంది. ఇంకా ఈ మెుబైల్ మూడు రంగుల్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజింగ్ ఫీచర్‌లతో పాటు 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉండనుంది.
Redmi 14C 5G స్పెసిఫికేషన్లు (అంచనా) –
ఇప్పటికే ఈ మొబైల్ చైనాలో లాంచ్ కావడంతో ఈ ఫీచర్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే Redmi 14C మెుబైల్ Redmi 14R రీ బ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. ఇక Redmi 14C ఫోన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల LCD ప్యానెల్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 5160 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సదుపాయం కలదు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతుంది. కెమెరా పరంగా, ఇది 50MP కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో రానుంది.
Redmi 14C 5G ధర –
పలు నివేదికల ప్రకారం, Redmi 14C ధర రూ. 11,000 నుండి రూ. 12,000 వరకు ఉండవచ్చు. అయితే, కంపెనీ ఇప్పటి వరకు ధరల ఖచ్చితమైన వివరాలను ధృవీకరించలేదు. కానీ అదే తక్కువ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే యువతకు ఇది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పొచ్చు
ALSO READ : మరో కొత్త మెుబైల్ ను మార్కెట్లోకి దించుతున్న రెడ్ మీ! ప్రాసెసర్, ఫీచర్స్ అదుర్స్