Mass Heroes : తెలుగు సినిమా పరిశ్రమలో “మాస్ హీరో” అనే ట్యాగ్‌కు ఎంతో విలువ ఉంది. ఏ యంగ్ హీరో ఇండస్ట్రీలోకి డెబ్యు ఇచ్చినా మాస్ హీరో అనే ట్యాగ్ కోసం కష్టపడుతూ ఉంటాడు. ఇప్పటికే గాడ్ ఆఫ్ మాసేస్ గా బాలయ్య ఫిక్స్ అయిపోయాడు. మాన్ ఆఫ్ మాసేస్ ట్యాగ్ ntr పేరుకి ముందు పడిపోయింది. దేవర సినిమాతో ఈ ట్యాగ్ అఫీషియల్ అయిపొయింది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాన్ ఆఫ్ మాసేస్ ట్యాగ్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఈ ట్యాగ్ విషయంలో ఎన్టీఆర్-రవితేజ ఫ్యాన్స్ మధ్య కూడా ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఇందుకు కారణం AI చాట్ బాట్ “గ్రోక్”.
ఇటీవల ఒక సినీ అభిమాని “మాన్ ఆఫ్ మాసేస్ ఎవరు” అనే ప్రశ్న గ్రోక్ కి వేయగా, దానికి జవాబుగా “రవితేజ” అని గ్రోక్ సమాధానం చెప్పింది. రవితేజ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ స్టైల్ వంటి అంశాలను హైలైట్ చేస్తూ, అతనే “మాన్ ఆఫ్ మాసేస్” అని గ్రోక్ చెప్పేసింది. కానీ, తెలుగు సినిమా అభిమానుల్లో చాలా మంది ఈ “మాన్ ఆఫ్ మాసేస్” ట్యాగ్‌ను ఎన్టీఆర్ కి లింక్ చేస్తుంటారు. ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్ డెలివరీ, మరియు మాస్ అప్పీల్ అన్నీ కలిపి అతన్ని ఈ ట్యాగ్‌కు అర్హుడిగా చేశాయని అభిమానులు భావిస్తారు. గ్రోక్ ఇచ్చిన ఈ సమాధానం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అప్సెట్ చేసింది, దీంతో సోషల్ మీడియాలో రెండు వర్గాల అభిమానుల మధ్య వాగ్వాదం మొదలైంది.
గ్రోక్ ఆన్సర్ ని వైరల్ చేస్తూ… ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో మాత్రమే “మాన్ ఆఫ్ మాసేస్” అంటూ ట్వీట్స్ చేస్తుంటే మరోవైపు, రవితేజ అభిమానులు కూడా తమ హీరోని సపోర్ట్ గా రంగంలోకి దిగారు. “రవితేజ కామెడీ, ఎనర్జీ, సింప్లిసిటీ మాస్ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయి”, “అతని సినిమాలు థియేటర్లలో మాస్ హంగామా సృష్టిస్తాయి” అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ రచ్చ ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ఎన్టీఆర్ మరియు రవితేజ ఇద్దరూ తెలుగు సినిమాలో తమదైన ముద్ర వేసిన హీరోలు. ఎన్టీఆర్ తన “సింహాద్రి”, “ఆది”, “రాఖీ”, “ఆర్‌ఆర్‌ఆర్” వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు. అతని డ్యాన్స్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ స్టంట్స్ అభిమానులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. మరోవైపు, రవితేజ “ఇడియట్”, “విక్రమార్కుడు”, “కిక్”, “మిరపకాయ్” వంటి సినిమాలతో తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇద్దరి స్టైల్స్ భిన్నమైనప్పటికీ, మాస్ అప్పీల్ పరంగా ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడతారు. అందుకే ఒకరు మాన్ ఆఫ్ మాసేస్ అయితే ఇంకొకరు మాస్ మహారాజ్ అయ్యారు. ఈ గ్రోక్ వచ్చిన తర్వాత ఫ్యాన్ వార్స్ మరింత పరిగాయి.