BigTV English

Pushpa2 Vs Game Changer : రామ్ చరణ్ vs అల్లు అర్జున్.. పుష్ప గాడు ఎందులో తగ్గేదేలే..

Pushpa2 Vs Game Changer : రామ్ చరణ్ vs అల్లు అర్జున్.. పుష్ప గాడు ఎందులో తగ్గేదేలే..

Pushpa2 Vs Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విలక్షణ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘ గేమ్ ఛేంజర్ ‘.. ఈ సినిమా నుంచి గత మూడేళ్లుగా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ను మేకర్స్ ఇచ్చారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఒకవర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ టీజర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ఫ్యాన్స్ వార్ అయ్యింది..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి..

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటినస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10 న రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తుందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ టీజర్ లో గెటప్స్ ని రివిల్ చేశారు. ఒక స్టూడెంట్ గా, సివిల్ సర్వెంట్ గా, స్టూడెంట్ లీడర్ గా, పొలిటికల్ లీడర్ గా భిన్నమైన క్యారెక్టరైజేషన్ గెటప్స్ లో కనిపించారు చరణ్. ఇందులో సివిల్ సర్వెంట్, పొలిటికల్ లీడర్ గెటప్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అయితే ఈ టీజర్ విమర్శలు అందుకుంటుందని తెలుస్తుంది..


పుష్ప 2 vs రామ్ చరణ్.. 

గేమ్ ఛేంజర్ టీజర్ లో కథ జోలికి వెళ్ళలేదు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏం చేసింది అనేది టీజర్ హుక్ పాయింట్. కైరా అద్వానీ, ఎస్ జె సూర్య, సముద్రఖని.. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ .. వాడు ఏం చేశాడు.. ఏం చేశాడు.. ఏం చేశాడు.. అనే డైలాగ్ తో ఒక క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. చివరిలో రామ్ చరణ్ ‘ఐయాం అన్ ప్రెడిక్టబుల్’ అని చెప్పడం టీజర్ కు ఆసక్తిగా మారింది. ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిముషాలకే భారీ వ్యూస్ ను అందుకున్న మరోవైపు విమర్శలు అందుకుంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ టీజర్ పై కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది. టీజర్ ఫ్యాచ్ వర్క్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఒక వీడియో గేమ్ థిమ్ ను తీసుకొని సినిమా చేసారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప నుంచి వచ్చిన పోస్టర్స్ ఇండస్ట్రీని షేక్ చేసాయి. అలాగే రెండు పాటలు రిలీజ్ అవ్వగా ఆ సాంగ్స్ ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత వచ్చిన రెండు పాటలు ప్రేక్షకుల విమర్శకులు అందుకున్నాయి. ఇప్పుడు వచ్చిన టీజర్ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎటు చేసినా కూడా పుష్ప కు మౌత్ టాక్ బాగానే ఉంది.. ఈ రెండు సినిమాల్లో పుష్ప గాడిదే పై చెయ్యి అని తెలుస్తుంది.. ఇక 25 రోజుల గ్యాప్లో వస్తున్నా గేమ్ ఛేంజర్ కు అంత బజ్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరి ఫ్యాన్స్ కూడా మా హీరో సినిమా గ్రేట్ అంటూ సోషల్ మీడియా వార్ మొదల పెట్టారు.. రిలీజ్ అయ్యాక టాక్ ఎలా    ఉంటుందో చూడాలి..

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×