Gnana Shekar VS: ఒక సినిమాలో 24 క్రాఫ్ట్స్ సెట్ అయితేనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత అది హిట్ అవుతుందా, అవ్వదా, ప్రేక్షకులు దానిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది తర్వాతి విషయం. అయితే అలాంటి 24 క్రాఫ్ట్స్‌లో ఒకటి సినిమాటోగ్రాఫీ. సినిమాటోగ్రాఫర్స్ అనేవారు సినిమాలో కీలక పాత్రలో పోషించే వారిలో ఒకరు. ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలి, ఎవరిని ఏ యాంగిల్‌లో చూపిస్తే బాగుంటుంది లాంటి అంశాలు సినిమాటోగ్రాఫర్లకు బాగా తెలుస్తాయి. అయితే అలాంటి సినిమాటోగ్రాఫర్లలో ఒక టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌కు ఇండియన్ సొసైటీలో స్థానం దక్కింది. దాంతో చాలామంది దర్శకులు ఆయనకు విషెస్ చెప్తున్నారు.
పెయింటింగ్‌తో మొదలు
హైదరాబాద్, ముంబాయ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్, పెయింటర్ అయిన జ్ఞాన శేఖర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన విన్సెంట్ వాన్ గాఘ్, నికో పిరోస్మని నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకొని పెయింటింగ్ మొదలుపెట్టారు. నేచురల్ ఫార్మ్స్‌ను మోడర్న్ ఆలోచనలతో కలిపి పెయింటింగ్ చేసేవారు. ఆ తర్వాత ఆయన ఫోటోగ్రాఫీ, సినిమాటోగ్రాఫీలో కెరీర్ మొదలుపెట్టారు. ముందుగా ముంబాయ్‌లో ప్రోమోలు, యాడ్స్, డాక్యుమెంటరీ షూట్ చేసేవారు. ఒక సినిమాటోగ్రాఫర్‌గా ఆయన డెబ్యూ చేసిన మొదటి చిత్రం వేదంతోనే జ్ఞాన శేఖర్‌కు మంచి గుర్తింపు లభించింది. అందులో ఆయన రియలిస్టిక్ అప్రోచ్ అందరికీ నచ్చింది.
Also Read: ప్రశాంత్ వర్మ కథ ఇచ్చినా కష్టమే… వెనక్కి తగ్గిన యంగ్ హీరో..?
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
2014లో విడుదలయిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, 2015లో విడుదలయిన ‘కంచె’ సినిమాలకు తనకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా స్టేట్ అవార్డ్ లభించింది. తెలుగులో మొదటి స్పేస్ సినిమాగా తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 కేపీహెచ్’కు జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రాఫీకి మంచి మార్కులు పడ్డాయి. అందులోని ఆయన కెమెరా టెక్నిక్స్, క్రియేటివిటీ అందరినీ ఆకట్టుకుంది. 1971 ఈస్ట్ పాకిస్థాన్ వార్ ఆధారంగా తెరకెక్కిన ‘ఐబీ71’ అనే సినిమాకు తను అందించిన సినిమాటోగ్రాఫీకి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ దక్కింది. విజువల్‌గా కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో జ్ఞాన శేఖర్ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్‌లో జ్ఞాన శేఖర్ సెలక్ట్ అయినందుకు తనకు కంగ్రాట్స్ చెప్పాడు దర్శకుడు క్రిష్.