మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. బుచ్చిబాబుతో రంగస్థలం సినిమాని మించే మూవీతో ఆడియన్స్ ని మెప్పించడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ నుంచి రామ్ చరణ్ బర్త్ డే రోజున ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. టైటిల్ “పెద్ది”గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.
పెద్ది పోస్టర్ చూసిన కొంతమంది సినీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో… ఇది పుష్పరాజ్ స్టైల్ ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఫస్ట్ లుక్ కూడా పెద్ది పోస్టర్ స్టైల్ లోనే ఉంటుంది. గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్, రగ్డ్ లుక్స్… ఈ మూడు విషయాల్లో పెద్ది, పుష్ప పోస్టర్స్ మధ్య సిమిలారిటీ ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు పోస్టర్స్ కలర్ టోన్ కూడా దాదాపు ఒకేలా ఉండడంతో ఆ కామెంట్స్ వినిపిస్తుండొచ్చు.
బుచ్చిబాబు, సుకుమార్ శిష్యుడు కాబట్టి దాదాపు గురువునే ఫాలో అయిపోయాడు, దించేసాడు అనే మాటలు వినిపిస్తున్నాయి కానీ బుచ్చిబాబు స్టైల్ వేరు. తను మొదటి నుంచి రూరల్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా చేసి పాన్ ఇండియా ఆడియన్స్ కి ప్రెజెంట్ చేస్తాను అనే చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే పెద్ది పోస్టర్ ఉంది.
Pushpa” ఒక ఊర మాస్ మూవీగా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే, “Peddi” కూడా అదే స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తుందా? అన్నది సినీ అభిమానుల్లో ఇంటరెస్టింగ్ టాపిక్ అయ్యింది. ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ యాక్టింగ్ బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, A. R. రెహ్మాన్ మ్యూజిక్ లాంటి ఎలిమెంట్స్ పెద్ది సినిమాపై అంచనాలు పెంచాయి, ఆ అంచనాలని పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత ఎత్తుకి తీసుకోని వెళ్లాయి..సినిమా టీజర్/ట్రైలర్ వస్తే అసలు పెద్ది సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది! ఇప్పటికైతే పెద్ది పోస్టర్ సోషల్ మీడియాని రూల్ చేస్తూ… రామ్ చరణ్ ని మరింత మాస్ గా ప్రెజెంట్ చేసింది.