Game Changer:జనవరి 4వ తేదీన రాజమండ్రిలో ఓపెన్ గ్రౌండ్ లోన్ దాదాపు లక్షమంది అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ (Game Changer)మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే టికెట్ మినిస్టర్స్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఇకపోతే అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కి వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ వరకు అంతా బాగుంది కానీ అభిమానులు తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టారు.
మృతులకు ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్..
ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి వెనుతిరిగిన అభిమానులలో ఇద్దరు మరణించడంతో ఈ చిత్రం నిర్మాత ప్రముఖ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dilraju) ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా తన వంతు సహాయంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆయన కూడా ప్రకటించడం జరిగింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు నిర్మాతగా దిల్ రాజు , ఇటు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కూడా తమ బాధ్యతలను నెరవేర్చడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలు..
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు సోలో హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా రాంచరణ్ నటనకి నేషనల్ అవార్డు వస్తుందని కూడా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభుత్వ ఉద్యోగికి , పొలిటిషన్ కి మధ్య వార్ అన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరికి జోడీగా కియారా అద్వానీ (Kiara Advani), అంజలి(Anjali ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
హైప్ పెంచిన ట్రైలర్..
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ కూడా ఎప్పుడు నటించనంత విధంగా ఈ సినిమాలో నటించారు అని కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయ్.. మరి మూడేళ్ల కష్టం తర్వాత ఈ సినిమా విడుదల కాబోతోంది. అటు దిల్ రాజుకి ఇటు రామ్ చరణ్ కే కాదు డైరెక్టర్ శంకర్ కి కూడా కం బ్యాక్ అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.