Sania Mirza : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ (Srija Konidela) గత ఏడాది చిన్న పిల్లల కోసం ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసింది. చిన్న పిల్లల ఆరోగ్యం, చదువు, నడవడికలపై ప్రత్యేక దృష్టిని పెట్టే విధంగా ‘సీసా స్పేసెస్’ (SeeSaw Spaces) పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఏడాది కిందటే ఇది జరిగ్గా, తాజాగా ‘సీసా’లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) భాగం కావడంతో మరోసారి ఈ ‘సీసా’ విషయం వార్తల్లో నిలిచింది.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఏడాది కిందట మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల, స్వాతి గునుగుపాటి ఈ ‘సీసా’ కేంద్రాన్ని స్టార్ట్ చేసారు. అయితే ఈ ఏడాది నుంచి అక్కడికి వచ్చే పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నామని కొత్త పార్ట్నర్ అయిన సానియా మీర్జా (Sania Mirza) వెల్లడించారు. కేవలం ఆటలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అలాగే ఫ్యామిలీతో వచ్చి అక్కడ ఉండేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్టు ఆమె వెల్లడించారు. 2025లో తన తీసుకున్న బెస్ట్ నిర్ణయాలలో ఇది కూడా ఒకటి అని తెలిపారు.
ఈ మేరకు సానియా మీర్జా (Sania Mirza) మాట్లాడుతూ “ప్రస్తుత తరం పిల్లలంతా కంప్యూటర్లకు, ఐపాడ్, ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. చేతిలో ఫోన్ లేనిదే వారికి తిండి తినడం కష్టం. ఓ తల్లిగా నాకు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. అలాగే నతోమంది తల్లులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ పిల్లలకు ఆరోగ్యం, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు మంచి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ లో చదువు అనేది చాలా ముఖ్యం. శ్రీజ కొణిదెల, స్వాతి గునుగుపాటి కలసి ఏర్పాటు చేసిన ఈ సీసా స్పెసెస్ లో ఇప్పుడు నేను కూడా పార్ట్నర్ ని అవుతున్నాను. ఇది చిన్నారులకు ఒక అద్భుతమైన ప్రాంతం కాబోతోంది” అని అన్నారు.
ఇంకా శ్రీజ కొణిదెల మాట్లాడుతూ సానియా మీర్జా పిల్లలను ఈ స్పోర్ట్స్ ద్వారా మరింత ప్రభావితం చేయబోతుందని, దీన్ని ఒక వ్యాపారంలా కాకుండా, చిన్న పిల్లలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని అన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్ అని, పిల్లలను తీసుకుని అక్కడికి వెళ్తే అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే దీన్ని హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించబోతున్నామని శ్రీజ కొణిదెల వెల్లడించారు.
దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మరో పార్ట్నర్ స్వాతి గునుగుపాటి మాట్లాడుతూ… ఇక్కడ కేవలం పిల్లలు మాత్రమే ఆడుకోవడానికి అని కాకుండా, పెద్దలకు కూడా అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. పేరెంట్స్ కోసం కెఫేను కూడా ఏర్పాటు చేశామని, ఈ ‘సీసా’లో ఏడాది వయసు ఉన్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. దీంతో చిన్నపిల్లల నుంచి మొత్తం 12 ఏళ్ల వయసు దాకా ఉన్న పిల్లలకు ఇది మంచి అవకాశం కాబోతోంది. ముఖ్యంగా సానియా మీర్జా కూడా పార్టనర్ కావడంతో పిల్లలు స్పోర్ట్స్ లో మరింత యాక్టివ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది.