BigTV English
Advertisement

Balayya : ఇదెక్కడి పిచ్చి మామా .. బాలయ్య పండక్కి సెలవు కావాలట..!

Balayya : ఇదెక్కడి పిచ్చి మామా .. బాలయ్య పండక్కి సెలవు కావాలట..!

Balayya : నందమూరి నట సింహం బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. సినిమాలు వస్తున్నాయంటే ఇక ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. అంతగా తన సినిమాలతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. మాస్ కా బాఫ్ అనే కథతో, పవర్ ఫుల్ డైలాగులతో ఫ్యాన్స్ కు అతనంటే పిచ్చి ఏర్పడేలా చేసాడు. ఇక బాలయ్య సినిమాలే కాదు బయట ఎక్కడ కనిపించిన చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతగా బాలయ్య క్రేజ్ మాస్ ఆడియన్స్ లో పెరిగిపోయింది. ఇక ఆయన సినిమాలతో పాటుగా ఓ ఎంటర్టైన్మెంట్ షో కు హోస్ట్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోను చూడటానికి ఫ్యాన్స్ పెట్టుకున్న రిక్వెస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ షోను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. ఈ ఎపిసోడ్ ను మొదటి ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ చెయ్యనున్నారు. దీనికోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా చంద్రబాబు సన్నిహితులు, పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ ష్టాపబుల్ షో కోసం తమకు సెలవులు ఇవ్వాలంటూ పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో రోడ్లు ఎక్కారు. చేతిలో ప్లకార్డులు ధరించి బాలయ్య పండుగ అంటే 25వ తేదీన మాకు హాలిడే కావాలి అంటూ వాళ్లు హైదరాబాదులోని హైటెక్ సిటీ లోని పలు బిల్డింగుల ముందు దర్శనం ఇచ్చారు.. ఈ నాలుగవ సీజన్ ని బాలయ్య పండుగగా ప్రమోట్ చేస్తూ వస్తోంది ఆహా. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులే ఇలా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు ఎక్కినట్లుగా భావిస్తున్నారు. లేక ఇది ఆహా టీం ప్రమోషనల్ స్ట్రాటజీయా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదేం పిచ్చి మామా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ బాలయ్య మజాకా అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త కాస్త వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×