BigTV English

Bigg Boss 8 Telugu: ముందడుగు వేసిన ఓజీ టీమ్.. గంగవ్వ అధిక ప్రసంగం, ఆ మాటలకు కంట్రోల్ లేదా?

Bigg Boss 8 Telugu: ముందడుగు వేసిన ఓజీ టీమ్.. గంగవ్వ అధిక ప్రసంగం, ఆ మాటలకు కంట్రోల్ లేదా?

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఆటలో జోరు పెరిగింది. పాత కంటెస్టెంట్స్‌లో కూడా ఉత్సాహం వచ్చింది. కానీ ఇప్పటివరకు జరిగిన ప్రతీ టాస్క్‌లో దాదాపు కొత్త కంటెస్టెంట్స్‌గా వచ్చిన రాయల్స్ టీమే గెలుస్తున్నారు. దీంతో ఓజీ టీమ్‌లో కసి పెరిగింది. తాజాగా బీబీ రాజ్యం అనే టాస్క్‌తో రాయల్స్, ఓజీ మధ్య పోటీ మొదలయ్యింది. మొదటి టాస్కులో కూడా రాయల్సే గెలిచారు. దీంతో ఓజీ టీమ్‌లో మరింత కసి పెరిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇకపై జరిగే టాస్కులు గెలవాలని ఓజీ టీమ్ ఫిక్స్ అయ్యింది. తన టీమ్ అందరికీ ‘సై’ సినిమా రేంజ్‌లో మోటివేషన్ ఇచ్చాడు.


అదేం ఆట?

బీబీ రాజ్యంలో ముందుగా ఒక టాస్క్ జరిగింది. అందులో గార్డెన్ ఏరియాలోకి వచ్చే బస్తాలను అందుకొని వారి పేరు మీద ఉన్న బండిపై పెట్టాలి. కానీ ఒకరి చేతిలో ఉన్న బస్తాను మరొకరు లాక్కోవడానికి వీలు లేదు. దీంతో అసలు బస్తాను బండిపై వేయకుండా మనుషులనే ఆపడానికి ప్రయత్నించారు. ఈ టాస్క్ కోసం జరిగిన మొదటి రౌండ్‌లో రాయల్స్ టీమ్ నుండి గౌతమ్, మోహబూబ్ రాగా.. ఓజీ టీమ్ నుండి నిఖిల్, పృథ్వి వచ్చారు. ఈ నలుగురు విచక్షణ కోల్పోయి దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా ఆడారు. రెండో రౌండ్ కోసం ప్లేయర్స్ మారారు. రాయల్స్ నుండి అవినాష్, టేస్టీ తేజ వచ్చారు. కానీ పృథ్వి, నిఖిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తామే ఆడతామని ముందుకొచ్చారు.


Also Read: బిగ్ బాస్‌లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్.. మళ్లీ అదే రిపీట్

ఒక్కటే గెలిచారు

ఈ టాస్క్‌కు యష్మీ సంచాలకురాలిగా వ్యవహరించింది. నిఖిల్ ఆడిన ఆట తప్పు అని రాయల్స్ అంతా అంటున్నా వినకుండా తమ టీమ్‌కే సపోర్ట్ చేసుకుంది. ఫైనల్‌గా అవినాష్, టేస్టీ తేజను వెనక్కి నెట్టి ఓజీ టీమ్ గెలిచింది. దీంతో వారి సంతోషానికి హద్దులు లేవు. ఇదంతా చూసిన గంగవ్వ అధిక ప్రసంగం మొదలుపెట్టింది. ఓజీ టీమ్ సరిగ్గా ఆడడం లేదని, మనం అన్ని టాస్కులు గెలిచాం, వారు ఒక్కటే గెలిచారని తక్కువ చేసి మాట్లాడింది. రాయల్స్ టీమ్ ఓడిపోవడంతో గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పించారు. ఎందుకంటే తను ఫిజికల్ టాస్కులు ఆడలేదని ఇన్నాళ్లకు వాళ్లు గుర్తించారు. రాయల్స్ టీమ్ గెలిచింది కాబట్టి వారి నుండి పృథ్వి చీఫ్ కంటెండర్ అయ్యాడు.

పిచ్చి నిర్ణయాలు

బీబీ రాజ్యంలో వైరస్ టాస్క్ అనే మరో టాస్క్ జరిగింది. దీనికి కూడా నబీల్, నిఖిలే ఆడడానికి వచ్చారు. అయితే తనకు చాలా బలం ఉంది అనుకున్న తేజ.. ఈ టాస్క్ ఆడడానికి ముందుకొచ్చాడు. తనతో పాటు గౌతమ్ కూడా ఈ టాస్క్ ఆడాడు. మొత్తానికి ఈ గేమ్‌లో కూడా ఓజీ టీమే గెలిచింది. ఈసారి రాయల్స్ టీమ్ నుండి ఒకరు చీఫ్ కంటెండర్ అవ్వాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు నాలుగు వారాల పాటు చీఫ్‌గా ఉన్న నిఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ విషయంలో విష్ణుప్రియా, ప్రేరణకు అన్యాయం జరిగింది. ఓజీ టీమ్ నుండి చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పుకోవడానికి గౌతమ్ స్వయంగా ముందుకొచ్చాడు. మెహబూబ్‌ను తీసేసే ఛాన్స్ ఉన్నా గౌతమే ఈ విషయంలో త్యాగం చేశాడు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×