Vishaka Metro Rail: ఏపీలో మెట్రో రైలు కూత వినిపించనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహింపబడుతున్న నేపథ్యంలో, ఏపీలో కూడా మెట్రో రైలు సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తాజాగా వైజాగ్ లోనూ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవాడలో మెట్రో రైలు లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, అదే తరహాలో వైజాగ్ లోనూ మెట్రో ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఈ ప్రకటనపై వైజాగ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఎన్నో పరిశ్రమలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు రోజురోజుకి ట్రాఫిక్ సమస్య కూడా విశాఖ నగర ప్రజలను వేధిస్తోంది. నగర జనాభా కూడా అంతే స్థాయిలో రోజురోజుకు పెరుగుతుండగా, రవాణా వ్యవస్థకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. వైజాగ్ అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. అదే వైజాగ్ లోనూ మెట్రో రైలు పరుగులు..
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మొదటి దశ డీపీఆర్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ డీపీఆర్ లో భాగంగా మూడు కారిడార్ల నిర్మాణం, 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. ఆ మూడు కారిడార్లలో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు మొత్తం 33.4 కిలోమీటర్లు, రెండవది గురుద్వారా నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు, మూడవది తాడి చెట్ల పాలెం నుండి చిన్న వాల్తేర్ వరకు 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Ganja Chocolates: మీ పిల్లలు చాక్లెట్స్ తింటున్నారా.. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి
అయితే ఈ మూడు కారిడార్ల నిర్మాణానికి మొత్తం రూ. 11498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఏది ఏమైనా విశాఖ నగరంలో అతి త్వరలోనే మెట్రో పరుగులు తీయనుందని చెప్పవచ్చు. మెట్రో రాకతో ట్రాఫిక్ సమస్యతో పాటు, నగరానికి కొత్త కళ సంతరించుకుంటుందని వైజాగ్ ప్రజలు తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
మొదటి దశలో 46.23 కి.మీ మేర మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వం
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కి.మీ మేర ఒకటో కారిడార్ గా డీపీఆర్ లో పేర్కోన్న ప్రభుత్వం
గురుద్వారా నుంచి పాత పోస్టు… pic.twitter.com/S66ktRduHB
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2024