Pushpa 2 Pre – release event: ప్రపంచం నలుమూలల వున్న అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒకే ఒక చిత్రం ‘పుష్ప 2’. డిసెంబర్ ఐదవ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు , స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఈ క్రమంలోనే జనసంద్రంతో పోలీస్ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒక్క ఈ ఈవెంట్ తో తేలిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఈవెంట్ కి వచ్చారని చెప్పవచ్చు.
పుష్ప రిలీజ్ సమయంలో రాజమౌళి కామెంట్స్..
ఇకపోతే అల్లు అర్జున్, రష్మిక మందన్న(Rashmika Mandanna), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉండగా..ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). స్టేజ్ పైకి రాగానే రాజమౌళి అందరిలో సినిమాపై హైప్ తీసుకొచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ..”పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాను. అప్పుడు చెప్పాను బన్నీ తో.. నార్త్ ఆడియన్స్ ని అస్సలు వదలద్దు అని, నాడు బన్నీకి నేను చెప్పిన మాటలను..బన్నీ కచ్చితంగా పాటించాడు. ఇక ఇప్పుడు పుష్ప -2 కి అక్కడ ప్రమోషన్స్ అవసరం లేదు. అంతలా భారీగా పాపులారిటీ దక్కించుకున్నారు. నార్త్ ఆడియన్స్ ని పట్టుకున్నామంటే ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదు. అంతలా అక్కడ హైప్ ఇచ్చేయొచ్చు. బన్నీ కచ్చితంగా అదే ఫాలో అయ్యాడు” అంటూ రాజమౌళి తెలిపారు.
సినిమాపై హైప్ పెంచిన రాజమౌళి..
ఇక అలాగే ఈ సినిమాలో ఇంట్రడక్షన్ పార్ట్ గురించి కూడా చెప్పి సినిమాపై హైప్ తీసుకొచ్చారు రాజమౌళి. రాజమౌళి మాట్లాడుతూ..” నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పక్కనే పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లి, కాసేపు అల్లు అర్జున్, సుకుమార్ లతో చిట్ చాట్ చేశాను. ఆ తర్వాత ఇంట్రడక్షన్ సీన్ నాకు చూపించారు. ఇక సుకుమార్ టాలెంట్ కి దేవిశ్రీప్రసాద్ ఎంతయితే మ్యూజిక్ అందించాలో అంతా ఇచ్చేశాడు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ కచ్చితంగా ఇక్కడ మనకు వచ్చింది. ఇక ఇంట్రడక్షన్ పార్టే ఇలా ఉందంటే ఇక మిగతా పార్ట్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్” అంటూ చెప్పాడు. అయితే ఇంతవరకే చెప్పాడు కానీ మిగతా సినిమా గురించి ఏమీ చెప్పకపోవడంతో బన్నీ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమా గురించి ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అని ఎప్పుడైతే రాజమౌళి అన్నారో అభిమానులు సైతం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చీఫ్ గెస్ట్ గా వచ్చిన రాజమౌళి ఇంకాస్త ఏదైనా మాట్లాడి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉండడం గమనార్హం.