BigTV English
Advertisement

Fatima Sana Shaikh: అమీర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ నే కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ నిర్మాత.. ?

Fatima Sana Shaikh: అమీర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ నే కమిట్మెంట్ అడిగిన  టాలీవుడ్ నిర్మాత.. ?

Fatima Sana Shaikh: ఇండస్ట్రీ..  ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించే రంగులు వేరు.. లోపల ఉండే అసలు రంగులు వేరు. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ కు క్యాస్టింగ్ కౌచ్ అనేది పెనుభూతంలా మారిపోయింది. ఎప్పటి నుంచో హీరోయిన్లు  క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతూనే వస్తున్నారు. కానీ, అప్పట్లో హీరోయిన్స్ ఇలాంటివి బయటపెట్టేవారు కాదు. దానివలన  అవకాశాలు పోతాయేమో.. కెరీర్ నాశనం చేస్తారేమో అనే భయం ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటివేమీ లేవు. సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు తాము ఎదుర్కున్న ఇబ్బందులను నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు సినిమాలు సక్సెస్ అయ్యాకా తాము పడిన బాధల గురించి చెప్పుకొస్తున్నారు.


తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఫాతిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో ఆయన పెద్ద కూతురుగా నటించి మెప్పించింది. ఈ సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ గా మారేలా చేసింది. ఇక దంగల్ తరువాత ఫాతిమా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఫాతిమా.. అమీర్ ఖాన్ తో  రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చాయి. అమీర్.. తన భార్య కిరణ్ రావుకు విడాకులు ఇవ్వడానికి కారణం ఫాతిమాతో ఎఫైరే అని వార్తలు వినిపించాయి. వీరిద్దరూ రెస్టారెంట్స్ కు తిరుగుతూ కెమెరా కంటికి కనిపించడంతో అందరూ నిజమే అనుకున్నారు.

ఇక ఫాతిమా, అమీర్ మధ్యన ఎలాంటి రిలేషన్ లేదని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫాతిమా ఒక ఇంటర్వ్యూలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్  బారిన పడినట్లు తెలిపింది. అది కూడా ఒక సౌత్ డైరెక్టర్ తనను  కమిట్మెంట్  అడిగినట్లు తెలిపింది. ” సౌత్ లో ఎంట్రీ ఇచ్చి.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకొని నార్త్ కు వెళ్తే మంచి అవకాశాలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేను కూడా ఉన్నాను. అందుకే నాకు సౌత్ లో ఛాన్సెస్ వస్తే అస్సలు మిస్ అవ్వకూడదని అప్పట్లో అనుకున్నాను.


Actor Murali Sharma: నువ్వు యాక్టర్ అవుతావా.. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా.. ?

అలా సౌత్ సినిమాలు  అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే నువ్వు నేను ఒకటవుదాం అనే సినిమా చేశాను. అనుకున్నట్లుగానే ఆ సినిమా తరువాత మంచి అవకాశాలు వచ్చాయి. ఇక ఒక సినిమా ఆడిషన్ కు వెళ్లాను. ఆ సినిమా నిర్మాత చాలా అసభ్యంగా మాట్లాడాడు. నిర్మాతలు ఏం చెప్పినా చేయాలి.. సినిమా కోసం ఏదైనా చేయాలి అని అన్నారు. దానికి పాత్ర కోసం ఎంత కష్టపడమన్నా పడతాను అని చెప్పాను. కానీ,  వారు సినిమా కోసమే కాదు.. ఇక్కడ చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. అవి కూడా చేయాలి అన్నారు.

నాకు అప్పటికే అర్ధమయినా అర్ధం కానట్లు మళ్లీ పాత్ర కోసం ఏదైనా చేస్తాను అని చెప్పాను. అలా కాదు.. సినిమా ఒప్పుకుంటే.. నువ్వు చాలామందిని కలవాలి. వారు ఏది చెప్తే అది చేయాలి అన్నారు. ఇక్కడ ఇదంతా కామన్ అన్నారు. నాకు అర్థమై నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఆ నిర్మాత పేరు నేను చెప్పను కానీ.. చాలా ఇబ్బంది పడ్డాను. ఈ క్యాస్టింగ్ కౌచ్ వలన నేను చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను. ఒకవేళ ఏదైనా ఆఫర్ వస్తే.. అందులో సగం రెమ్యూనరేషన్   డైరెక్టర్స్ తీసుకొని మిగతాది నాకిచ్చేవారు” అని చెప్పుకొచ్చింది. దీంతో అమీర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ నే కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ నిర్మాత..  ఎవరై ఉంటారు అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×