CM Revanth Reddy: గద్దర్ ఈ సమాజానికి ఎంతో సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. గద్దర్ మృతిచెందినప్పుడు గత ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూసిందని సీఎం పేర్కొన్నారు.
‘అవార్డు ఇవ్వడమంటే ప్రతీ ఏటా ఆయనను స్మరించుకోవడమే. ఒక గొప్ప వ్యక్తి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. గత ప్రభుత్వం గద్దర్ పార్థీవ దేహాన్ని ఎల్బీ స్టేడియంలోకి తీసుకెళ్లనివ్వలేదు. గద్దర్‌తో ఎవరు విభేదించినా.. ఆయన సిద్ధాంతం చాలా గొప్పది. గద్దర్‌కు ఘననివాళి అర్పేంచేందుకు కూడా పోరాడాల్సి వచ్చింది. రాష్ట్రాల కలయికనే కేంద్రమని ఢిల్లీ పెద్దలు గుర్తుంచుకోవాలి. గద్దర్ పేరును ప్రతిపాదించినా పద్మ అవార్డు ఇవ్వలేదు. గద్దర్ అన్న ఎవరూ విమర్శించకూడదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలను కేంద్ర అవమానించింది. రాష్ట్రం ప్రతిపాదించిన పేర్లను పట్టించుకోకపోవడం దారుణం. పక్క రాష్ట్రంలో ఐదుగురికి పద్మ అవార్డులు ఇచ్చారు.. మావాళ్లకు పద్మ అవార్డులకు అనర్హులా..?’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: Clinical Assistant Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.50,000 జీతం..
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘గద్దర్‌ను అవమానిస్తే బీజేపీ ఆఫీస్ ఏరియాకు ఆయన పేరు పెడతా.. గద్దర్‌ను అవమానిస్తే తగిన శాస్తి చేస్తాం. బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం. కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చాక రాహుల్ గాంధీతో మాట్లాడి గద్దర్‌కు పద్మ అవార్డు తీసుకొస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.