Curry Leaves: కరివేపాకు ఒక సహజ ఔషధం. ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ, జుట్టు, చర్మం లేదా ఇతర శారీరక సమస్యలు ఏదైనా సరే, కరివేపాకు ప్రతి సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. తరచుగా మీరు కరివేపాకు తింటే మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మరి కరివేపాకు తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం
కరివేపాకు చాలా మంది వంటకాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాయి. ఇది కేవలం ఆహార రుచిని పెంచడం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కరివేపాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా, కాల్షియం, భాస్వరం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో కరివేపాకును చేర్చుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. అంతేకాకుండా, ఇది బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియకు ప్రయోజనకరం:
కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, వాంతులు వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. కరివేపాకును నీటిలో మరిగించి తాగడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయి. దీని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
డయాబెటిస్ :
డయాబెటిస్ రోగులు ఖచ్చితంగా కరివేపాకు తినాలి. ఇందులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా కరివేపాకు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. ఇది డయాబెటిస్‌లో ఉన్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.డయాబెటిస్ రోగులు దీనిని ప్రతి రోజు కరివేపాకు తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
బరువును నియంత్రించడం:
బరువు తగ్గాలనుకుంటే కరివేపాకు తినడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , ఫైబర్ శరీరాన్ని డీటాక్స్ చేసి కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారు కరివేపాకు తినడం అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
జుట్టుకు మేలు:
కరివేపాకు మీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మీ అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. ఇందులో జుట్టుకు మేలు చేసే విటమిన్ ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా నల్లగా మారుస్తాయి.
Also Read: ఇలా చేస్తే.. నల్లగా మారిన కాళ్ల పట్టీలైనా కొత్త వాటిలా మెరిసిపోతాయ్ !
ఒత్తిడిని తగ్గించడం:
కరివేపాకు తినడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీని శోథ నిరోధక లక్షణాలు నాడీ వ్యవస్థను ప్రశాంత పరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది ఒత్తిడి నుండి ఉపశమనం అందిస్తుంది. ఇదే కాకుండా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి, శరీరానికి కూడా అందిస్తుంది. ఒత్తడి తగ్గాలని అనుకునే వారు కరివేపాకు తినడం అలవాటు చేసుకోవాలి.