BIG TV LIVE Originals: ఇండియన్ రైల్వేలోకి సరికొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సొగసైన డిజైన్, అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణానికి అనుకూలంగా వీటిన రూపొందించారు. 800 నుంచి 1200 కిలో మీటర్ల పరిధిలో ప్రయాణించే ఈ రైళ్లను దేశ వ్యాప్తంగా ఒకేసారి 10 రూట్లలో ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లకు ఫ్రీగా రుచికరమైన ఫుడ్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆన్ బోర్డ్ మెనూ ఎలా ఉండబోతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చైర్ కార్ వందేభారత్ కు మించి..
ఇప్పటి వరకు చైర్ కార్ ఆధారిత వందేభారత్ ఎక్స్ ప్రెస్ మారిగా కాకుండా స్లీపర్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. 3-టైర్, 2-టైర్, ఫస్ట్ AC కాన్ఫిగరేషన్‌లలో ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ కోచ్‌లను కలిగి ఉంటుంది. ఈ రైళ్లు ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి. ఇక ఈ రైళ్ల ఫుడ్ విషయానికి వస్తే చైర్ కార్ రైళ్లకు మించిన ఫుడ్ అందించే అవకాశం ఉంది. ఇందులోనూ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఫుడ్ అందించనుంది. ఈ రైళ్లలో నచ్చిన ఫుడ్ తీసుకునే అవకాశం ఉంది. ముందుగా బుక్ చేసుకున్న ఫుడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆన్ బోర్డు లో కావాల్సిన ఫుడ్ తీసుకోవచ్చు. అయితే, ఈ సేవలను పొందేందుకు చైర్ కార్ వందే భారత్ లో అదనంగా రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, స్లీపర్ రైళ్లు ఛార్జ్ ఎలా ఉంటుంది? అనేది ఇంకా తెలియదు. ఇక వందేభారత్ లో ప్యాంట్రీకార్ ఉండకపోవచ్చు. బేస్ స్టేషన్లలో భోజనాలను ముందే లోడ్ చేసి కంటైనర్లలో నిల్వ చేసే అవకాశం ఉంది. నాణ్యత, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అయితే, ఇ- క్యాటరింగ్ సేవలు అందుబాటులో ఉండవు.
సీటు దగ్గరే భోజనం వడ్డింపు
వందే భారత్ స్లీపర్ రైళ్లలో భోజనం సీటు దగ్గరికి తీసుకొచ్చి అందించనున్నారు. రాత్రిపూట డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. మధ్యాహ్నం సమయంలో భోజనం అందించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లకు కచ్చితమైన మెనూ ఇంకా ఖరారు కానప్పటికీ, ఇది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మెనూను ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ రుచులు, ప్రీమియం నాణ్యతను కలిగి ఉండనున్నాయి.
⦿ బ్రేక్ ఫాస్ట్: స్టఫ్డ్ పరాఠా, వెజిటబుల్ కట్లెట్, ఉప్మా, పోహా, శాండ్ విచ్‌లు, బ్రాండెడ్ పెరుగు, టెట్రా ప్యాక్ జ్యూస్ అందించే అవకాశం ఉంది. టీ, కాఫీ అందించనున్నారు. చాయోస్ లేదంటే నెస్కేఫ్ వంటి బ్రాండెడ్ సెలెక్షన్స్ ఉండనున్నాయి.
⦿ లంచ్/డిన్నర్: పనీర్ టిక్కా, దాల్ మఖానీ, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, బాస్మతి రైస్, రోటీ, దోసకాయ సలాడ్ లాంటి శాకాహారం, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పులావ్‌తో గ్రిల్డ్ చికెన్ మాంసాహారం అందిస్తారు. బ్రాండెడ్ ఐస్ క్రీం, మూంగ్ దాల్ హల్వా లాంటి సాంప్రదాయ స్వీట్లు అందిస్తారు. మజ్జిగ, కూల్ డ్రింక్స్ లాంటి పానీయాలు లభిస్తాయి.
⦿ ప్రాంతీయ రుచులు: స్థానిక వంటకాలను కలుపుకొని మెనూ మారే అవకాశం ఉంది. మహారాష్ట్ర గుండా వెళ్ళే రైళ్లలో సబుదాన వడ లేదంటే చికెన్ కొల్హాపురి అందించవచ్చు. సౌత్ ఇండియాలో ఇడ్లీ, వడ, మసాలా దోస ఉండవచ్చు.
ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫుడ్ ప్రీమియం బ్రాండింగ్‌కు అనుగుణంగా, పిండ్ బలూచి లేదంటే ల్యాండ్‌మార్క్ హోటల్ లాంటి రెస్టారెంట్ల నుండి భోజనాలు సేకరించాలని భావిస్తున్నారు. ధర రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్నారా? ఆన్‌బోర్డ్‌లో కొనుగోలు చేశారా? అనే దానిపై ఆధారపడి భోజనం ధర రూ. 155 నుంచి రూ. 350 వరకు ఉంటుందంటున్నారు. కొంత మంది మాత్రం ఉచితంగానే అందిస్తారని చెప్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియనున్నాయి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్?