Anil Ravipudi .. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పడం కష్టం. ఈరోజు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు రేపు ఉండకపోవచ్చు.. లేదా ఊహించని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవచ్చు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయి, ఇప్పుడు ఎవరైతే వారికి అవకాశం కల్పించారో.. వారే తమ సినిమాలలో మళ్లీ నటించడానికి డేట్స్ అడుక్కోవడం బట్టి చూస్తే ఇక వారి రేంజ్ ఎలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. తన తదుపరి సినిమాల్లో డేట్స్ కోసం వారిని అడుక్కోవాల్సిన పరిస్థితి డైరెక్టర్ కి ఏర్పడింది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఓవర్ నైట్ లోనే సెలెబ్రెటీ అయిపోయిన ఆ స్టార్ ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఒక్క సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న బుల్లిరాజు..
ఆయన ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi).. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఈ ఏడాది వెంకటేష్ (Venkatesh ) హీరోగా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేసిన చిత్రం ‘సంక్రాంతి వస్తున్నాం’. ఇందులో ప్రముఖ బ్యూటీ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలై ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ (Bheemala Revanth) గురించి పరిచయం అవసరం లేదు. చూడడానికి చిన్నవాడే అయినా తన సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం బుల్లిరాజుగా ఫేమస్ అయిన ఇతడు రోజుకు లక్ష రూపాయలు వరకు డిమాండ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ((Megastar Chiranjeevi) మూవీలో రేవంత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
also read : Sonia Singh: 2 నెలల్లోనే 2 లగ్జరీ కార్లు… సోనియమ్మ… నీకు ఇంత డబ్బు ఎక్కడిది?
బుల్లిరాజు డేట్స్ కోసం అడుక్కుంటున్న అనిల్ రావిపూడి..
ఇదిలా ఉండగా మరోవైపు.. ప్రస్తుతం అనిల్ రావిపూడి, రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 8’ షో కి గెస్ట్ గా వచ్చారు రేవంత్.. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి సుధీర్ (Sudheer) యాంకర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ.. “మీ సినిమాలో మీరు పరిచయం చేసిన పిల్లోడు మీ షోకే గెస్ట్ గా వచ్చాడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అని అనిల్ రావిపూడిని అడగ్గా.. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అనే పాట వేస్తూ బుల్లిరాజును అనిల్ ఎత్తుకునేందుకు ప్రయత్నం చేసి విఫలమవుతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” నా షో కి గెస్ట్ గా రావడం కాదు.. నా నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ అడుక్కోవాల్సి వస్తోంది” అంటూ సరదాగా అన్నారు అనిల్ రావిపూడి. మరి సార్ నెక్స్ట్ సినిమాకి డేట్స్ ఇచ్చావా అని సుదీర్ అడగగా.. ఇచ్చాను అంకుల్ అంటూ బుల్లిరాజు ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఇక దీన్ని బట్టి చూస్తే బుల్లి రాజుకి ఇండస్ట్రీలో డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అనిల్ రావిపూడి కామెంట్స్ ని బట్టి అర్థమవుతుంది.