Thalapathy Vijay :ప్రముఖ నటుడు విజయ్ (Vijay ).. తన సినీ కెరీర్ కి ఇక స్వస్తి పలకబోతున్న విషయం తెలిసిందే. ఆయన కెరియర్లో చివరి సినిమాగా 69వ సినిమాగా వస్తున్న చిత్రం “జననాయగన్”. హెచ్.వినోద్ (H.Vinodh) దర్శకత్వం వహించిన ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్ నటిస్తోంది. వీరితో పాటు ప్రకాష్ రాజ్ (Prakash Raj),ప్రియమణి (Priyamani),గౌతమ్ మీనన్ (Gautham Menon), మమిత బైజు (Mamita Baiju) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ తాను స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నారు విజయ్.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సర్ప్రైజ్ లతో ఆడియన్స్ కి భారీ ఊరట..
ఇకపోతే ఈ సినిమాలో అట్లీ, లోకేష్ కనగరాజు, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు వీరి పాత్రలు కూడా సినిమాలో చాలా సర్ప్రైసింగ్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇదే కాకుండా విజయ్ చివరి సినిమాగా వస్తున్న ఈ సినిమాలో చిత్ర విచిత్రాలు ఇంకా ఎన్నో చూడబోతున్నారని సమాచారం. ఇంతేకాదు ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉండబోతోంది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ ట్రాక్ ని వదలడానికి ర్యాపర్ హనుమాన్ కిండ్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇక అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో కొడైకనల్ లో షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే మరో షెడ్యూల్ కూడా మొదలు కాబోతోంది. ఏదేమైనా విజయ్ చివరి సినిమాలో ఇలాంటి విచిత్రాలు ఇంకా ఎన్ని చూడాలో అని అభిమానులు చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.
విజయ్ కెరియర్..
విజయ్ విషయానికి వస్తే 1974 జూన్ 22న మద్రాస్ లో జన్మించారు. ఆయన తండ్రి యస్ ఏ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్.. ఆమె సినిమా నేపథ్య గాయని మాత్రమే కాదు కర్ణాటక సంగీత విద్వాంసులు కూడా.. విజయ్ కి విద్యా అనే సోదరి కూడా ఉంది. ఆమె రెండేళ్ల ప్రాయంలోనే మరణించింది. సోదరీ మరణం విజయ్ పై తీవ్ర ప్రభావం చూపిందట. ఇక తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉండేవాడని, తన సోదరీ మరణం తర్వాత ఆయనలో పూర్తిగా చురుకుదనం తగ్గిందని చెబుతూ ఉండేవారు. ఎలాగైనా సరే ప్రజలకు మంచి చేకూర్చాలని, ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారని సమాచారం