BigTV English

Pahalgam Terror Probe: పహల్గాం దాడి విచారణ.. ఆ ఉగ్రవాది ఇంట్లో సోదాలు..

Pahalgam Terror Probe: పహల్గాం దాడి విచారణ.. ఆ ఉగ్రవాది ఇంట్లో సోదాలు..

Pahalgam Terror Probe| పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కశ్మీర్‌లో భద్రతా దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో 1999 విమానం హై జాక్ కేసులో ఉగ్రవాది ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలు చేసింది. 1999లో ఐసీ 814 విమాన హైజాక్ సంఘటనలో విమానంలో ప్రయాణికులను ప్రాణాలకు విడుదల చేసేందుకు బదులుగా జైల్లో ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. అలా జైలు నుంచి విడుదలైన ఉగ్రవాది అల్ ఉమర్ ముజాహిద్దీన్ అధినేత ముష్తాక్ అహ్మద్ జర్గర్‌ ఇల్లు కశ్మీర్ రాజధాని శ్రీ నగర్ లో ఉంది. కానీ ఉగ్రవాది జర్గర్ మాత్రం పాకిస్తాన్ లో ఉన్నాడని సమాచారం.


తాజాగా పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడుల ఘటన సంద్భంగా జర్గర్ నివాసంలో కూడా భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. కీలకమైన ఆధారాలను సేకరించేందుకు ఈ సోదాలు చేపట్టారు. గత వారంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తూ.. వారితో సంబంధమున్న మొత్తం 60 మంది ఇళ్లపై దాడులు చేశాయి. ఈ విచారణలో ఇప్పటివరకు మొత్తం 1900 మందిని ఎన్‌ఐఏ ప్రశ్నించింది.

పహల్గాం దాడికి సంబంధించి ‘సీన్ రీకన్‌స్ట్రక్షన్’ కోసం ఎన్‌ఐఏ అత్యాధునిక సాంకేతిక విధానాలను ఉపయోగిస్తోంది. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అంతేకాకుండా, దాడి జరిగిన స్థలాన్ని హై-రిజల్యూషన్ 3డీ మోడల్‌గా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ 3డీ మోడల్‌ను కోర్టులో విచారణ సమయంలో దర్యాప్తుకు ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు  ఘటనా స్థలం నుంచి విచారణ అధికారులు 40 ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు మొబైల్ టవర్ల నుంచి పాత డేటాను కూడా దర్యాప్తు బృందాలు సేకరిస్తున్నాయి.


పహల్గాం దాడిలో పాక్ ఐఎస్‌ఐ పాత్ర

పహల్గాంలో పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో టూరిస్టులను హత్య చేయాలన్న కుట్రను ప్రాథమికంగా లష్కరే తోయిబా రూపొందించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ కుట్రకు పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ ఆపరేటివ్‌లు సహకారం అందించగా, పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలో ఈ పథకానికి ఫైనల్ ప్లాన్ రెడీ అయింది. ఈ దాడికి లష్కరే ఉగ్రవాదులు హషీమ్ ముసా, అలీభాయ్‌లు కేంద్ర బిందువులుగా నిలిచినట్లు ఎన్‌ఐఏ అంచనా వేసింది. వీరిద్దరూ పాకిస్థాన్ జాతీయులు. 2024లో జరిగిన గగనగర్ ఉగ్రదాడితో వీరికి సంబంధం ఉందని దర్యాప్తు బృందాలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే, వీరు చీనాబ్ లోయ నుంచి వచ్చి ఉండవచ్చని, కానీ అటువైపు తిరిగి వెళ్లకుండా దక్షిణ కశ్మీర్ లోనే దాగి ఉన్నట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు.

Also Read: బార్డర్ మూసివేసిన పాకిస్తాన్.. వందలాది పాక్ పౌరులు ఎండలో నడిరోడ్డపైనే విలవిల

ఉగ్రవాదులతో పాక్ సంబంధాలు నిజమే.. అంగీకరించిన పాక్ ఎంపీ

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ భారత్‌పై విమర్శలు చేసినప్పటికీ, ఆ దేశ నేతలు ఉగ్రవాద సంస్థలతో తమ సంబంధాలను స్వయంగా అంగీకరిస్తున్నారు. పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌లు మీడియా సమావేశాల్లో పాకిస్తాన్ గతంలో ఉగ్రవాదులకు మద్దతిచ్చిన విషయం నిజమేనని తెలిపారు. అమెరికా, పశ్చిమదేశాల కోసం ఇలా చేయాల్సి వచ్చిందని, దానివల్ల పాక్‌నే నష్టపోయిందన్నారు. పాహల్గాం దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ బాధ్యత వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ దాడికి ప్రతిగా భారత్ పలు నిర్ణయాలు తీసుకుంది, అందులో సింధూ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఈ నేపథ్యంలో భుట్టో సింధూ నది విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు

వరుసగా ఎనిమిదో రోజు కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు జరిపింది. భారత బలగాలు వీటిని గట్టిగా తిప్పికొట్టాయి. అదనంగా, సరిహద్దు ప్రాంతంలోని బంకర్లను శుభ్రపరిచి, స్థానికులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×