BigTV English

Filmmakers : ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన అక్తర్

Filmmakers : ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన అక్తర్

Filmmakers : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్… ఇప్పుడు మరోసారి తన చంచల మనస్తత్వాన్ని ప్రదర్శించాడు. అయితే ఈసారి ఆటకు సంబంధించిన విషయంలో కాకుండా… సినిమాకు సంబంధించిన వ్యవహారంలో నిర్ణయాన్ని మార్చుకుని, ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చాడు.


పాకిస్థాన్ క్రికెట్లోనే కాదు.. వరల్డ్ క్రికెట్లోనూ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’ అనగానే గుర్తొచ్చే పేరు షోయబ్‌ అక్తర్‌. అదే ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో బయోపిక్‌ రూపొందించాలని ప్లాన్ చేసిన కొందరు ఫిల్మ్ మేకర్స్… నిరుడు జులైలో అక్తర్‌తో ఒప్పందం చేసుకుని… పని కూడా మొదలుపెట్టారు. అప్పట్లో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు… అక్తర్. ఈ ఏడాది నవంబర్ 13న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఫిల్మ్ మేకర్స్… ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించి కొంత భాగం పూర్తి చేశారు కూడా. ఈ బయోపిక్‌కు మహ్మద్‌ ఫర్హాజ్‌ ఖాసిర్‌ డైరక్టర్‌గా వ్యవహరిస్తుండగా… క్యూ ఫిలిం ప్రొడక్షన్‌ తెరకెక్కిస్తోంది. అయితే, ఉన్నట్టుండి బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి… అక్తర్‌ అందరికీ షాకిచ్చాడు.

ప్రొడక్షన్‌ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు… షోయబ్ అక్తర్. అంతేకాదు, తన అనుమతి లేకుండా బయోపిక్‌ రూపొందిస్తే లీగల్‌ యాక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’ బయోపిక్‌ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరంగా ఉందని, కొన్ని నెలల కిందటే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయని, అందుకే బయోపిక్‌ రూపొందించడాన్ని విరమించుకోవాలనే నిర్ణయం తీసుకున్నానని అక్తర్ ట్వీట్ చేశాడు. త్వరలోనే తన లీగల్‌ టీమ్‌ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతోందని ప్రకటించాడు. దాంతో… మాటల్లో అయినా, చేతల్లో అయినా ఎప్పుడూ ఓ నిర్ణయానికి కట్టుబడవా? అని అభిమానులంతా అక్తర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.


Follow this link for more updates : Bigtv

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×