KGF 3 : గతంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమాల్లో కెజీఎఫ్ సిరీస్ ఉన్నాయి.. కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీలో హీరోగా నటించారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. పీరియాడిక్ యాక్షన్ మూవీగా వచ్చిన ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసింది. పాజిటివ్ టాప్ తో పాటు భారీగా కలెక్షన్స్ ని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.. మూవీ కి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజమౌళి వంటి దర్శక ధీరులకే షాక్ ఇచ్చేలా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ సీక్వెల్ గా కెజీఎఫ్ 3 రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇందులో రాకింగ్ స్టార్ యష్ కాకుండా మరో హీరోని దించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కెజీఎఫ్ సిరీస్ లు..
2018లో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 తర్వాత నాలుగేళ్లకు 2022 ఏప్రిల్ 14న కేజీఎఫ్ ఛాప్టర్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.. మొదటి పార్ట్ నుంచి రెండో పార్ట్ ఆసక్తిగా ఉండటంతో రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1240 కోట్లు గ్రాస్ వసూలు చేసి సంచలనంగా మారింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మొదటి 500 కోట్ల సినిమాగా, అలాగేవెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమాలుగా రికార్డులను సొంతం చేసుకున్నాయి. ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో 8వ స్థానాన్ని దక్కించుకుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 భారీ బ్లాక్ బస్టర్ కావడంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై ప్రేక్షకులకు మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.. ఈ మూవీ నుంచి ఓ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. అన్నీ హిట్ సినిమాలే..
కెజీఎఫ్ 3 నుంచి యష్ ను తప్పించారా..?
ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్ లో వచ్చిన కెజీఎఫ్ చిత్రాలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. రెండు పార్ట్ లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో పార్ట్ పై కూడా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా యష్ కాదని మరో అగ్ర హీరోతో ప్రశాంత్ ని సినిమాని చేయబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. నిజానికి యష్ బిజీగా ఉండడం వల్ల మరో హీరోని వెతికే పనిలో డైరెక్టర్ ఉన్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం యష్ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న గ్యాంగ్ స్టార్ ఫిలిం టాక్సిక్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈ సినిమాలో ఏ హీరోని ఫైనల్ చేస్తారో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. 2026 లో సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే కేజీఎఫ్ ఛాప్టర్ 3లో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఉండబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీ తర్వాత కేజిఎఫ్ ని పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం..