Sakshi Agarwal:ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అలా తాజాగా బిగ్ బాస్ షో ద్వారా అలాగే సినిమాల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన ఈ నటి కూడా పెళ్లి చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎవరిని పెళ్లి చేసుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం.. ఆమె ఎవరో కాదు సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal). ఈ పేరు చెబితే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ రజినీకాంత్ (Rajinikanth)హీరోగా చేసిన ‘కాలా’ మూవీలో రజినీకాంత్ కోడలు పాత్రలో నటించింది. అలాగే సాక్షి అగర్వాల్ మొదట నటించిన మూవీ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘రాజారాణి’. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో మాత్రమే నటించింది.
తమిళ్, కన్నడ భాషల్లో భారీ గుర్తింపు..
ఆ తర్వాత కన్నడ,తమిళ భాషల్లో రాణించింది సాక్షి. ఇక సాక్షి అగర్వాల్ ఇప్పటివరకు ఒక్క స్ట్రెయిట్ తెలుగు ఫిలిం లో కూడా నటించలేదు. కానీ సాక్షి అగర్వాల్ తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.అలా అరన్మనై -3 తెలుగులో అంతఃపురంగా విడుదలైంది. ఈ సినిమాలో సాక్షి కనిపించింది.అలాగే విశ్వాసం, కాలా,టెడ్డి, సిండ్రెల్లా వంటి సినిమాల్లో చేసింది.అలా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సహాయక పాత్రల్లో రాణించిన ఈ ముద్దుగుమ్మ, కేవలం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది. సాక్షి అగర్వాల్ తమిళ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, తమిళ బుల్లితెర ప్రేక్షకులను తన ఆటతో అలరించింది..
చిన్ననాటి మిత్రుడిని వివాహం చేసుకున్న సాక్షి అగర్వాల్..
మరి ఇంతకీ సాక్షి అగర్వాల్ పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఎవరంటే నవనీత్ మిశ్రా (Navaneeth mishra).. నవనీత్,సాక్షి అగర్వాల్ లు ఇద్దరూ చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్. అలా వీరి మధ్య ఉన్న స్నేహబంధం కాస్త ప్రేమబంధంగా మారి కొద్ది రోజులు డేటింగ్ చేశారు. డేటింగ్ తర్వాత వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.అలా సాక్షి అగర్వాల్ నవనీత్ ఇద్దరూ గోవాలోని ఒక స్టార్ హోటల్లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి జరిగిన విషయాన్ని సాక్షి అగర్వాల్ స్వయంగా బయట పెట్టింది.
పెళ్లి ఒక కలలా అనిపిస్తోంది..
తన సోషల్ మీడియా ఖాతాలో నవనీత్ మిశ్రాతో జరిగిన పెళ్లి విషయాన్ని కన్ఫామ్ చేస్తూ తమకు సంబంధించిన పెళ్లి ఫోటోలను సైతం అభిమాలతో పంచుకుంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇక అందులో ఏం రాసిందంటే.. “నవనీత్ ని పెళ్లి చేసుకోవడం ఒక కలలా అనిపిస్తోంది. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం.ఇప్పుడు భార్యాభర్తలయ్యాం..కొత్త జీవితంలోకి అడుగుపెట్టాం.. నవనీత్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి.ఈ కొత్త అధ్యాయం కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది సెలబ్రిటీలు,అభిమానులు సోషల్ మీడియా జనాలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి సాక్షి అగర్వాల్ పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెబుతుందా.. లేక అలాగే ఇండస్ట్రీలో రాణిస్తుందా అనేది చూడాలి. ఇక సాక్షి అగర్వాల్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు బుల్లితెరపై కూడా కొన్ని షోలకు హోస్ట్ గా చేసి అలరించింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.ప్రస్తుతం సాక్షి అగర్వాల్ నవనీత్ మిశ్రాల పెళ్లి ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి