BigTV English

Project K: ప్రాజెక్ట్-K ఫస్ట్ డే టార్గెట్ రూ.500 కోట్లు!.. బీట్ చేసే సత్తా రాజమౌళి-మహేశ్‌లకే!

Project K: ప్రాజెక్ట్-K ఫస్ట్ డే టార్గెట్ రూ.500 కోట్లు!.. బీట్ చేసే సత్తా రాజమౌళి-మహేశ్‌లకే!
project k

Project K: ప్రాజెక్ట్-కె ఈ పేరు వింటేనే గూస్ బంప్స్. ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ రాని సైన్స్ ఫిక్సన్. మరో లెవెల్‌లో తీస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇమేజ్‌ను బాహుబలిని మించి పెంచేసే సత్తా ఉన్న సినిమా. దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ లాంటి స్టార్స్‌తో ఫుల్లీ లోడెడ్ మూవీ.


ప్రాజెక్ట్-K (Project K) బడ్జెట్ ఎంతో చెప్పడం కష్టం. మరి, అంతపెడితే వసూళ్ల మాటేంటి? ఆ డౌటే అవసరం లేదంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తాను పలుమార్లు ప్రాజెక్ట్-కె సినిమా షూటింగ్‌ సెట్‌కు వెళ్లానని.. మేకింగ్ చూసి అవాక్కయ్యానని చెప్పారు. ప్రాజెక్ట్‌-కె పాన్ ఇండియా మూవీ కాదని.. గ్లోబల్ సినిమా అని అన్నారు.

కరెక్ట్‌గా ప్రమోషన్ చేస్తే.. వరల్డ్‌ టాప్‌-50 కలెక్షన్ల చిత్రాల జాబితాలో ప్రభాస్ సినిమా కూడా ఉంటుందన్నారు తమ్మారెడ్డి. ఫస్ట్ డేనే రూ.500 కోట్లు వసూల్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఆదిపురుష్‌కే తొలిరోజు 140 కోట్ల గ్రాస్ రాగా.. ప్రాజెక్ట్ కె.. అంతకుమించి.. 500 కోట్లు ఈజీగా రాబడుతుందని చెప్పారు. ప్రభాస్ క్రేజ్ అలాంటిది మరి. ఆ మేరకు చిత్ర బృందానికి అడ్వాన్స్డ్ విషెష్ చెప్పారు.


ప్రాజెక్ట్-K తర్వాత.. రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చే మూవీ మాత్రం కచ్చితంగా ఆ రికార్డ్ సాధిస్తుండమో, బ్రేక్ చేయడమో చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆడుతూ పాడుతూ ఈజీగా రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేస్తుందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. కాకపోతే, మహేశ్‌బాబు సినిమా కంప్లీట్ చేసేందుకు రాజమౌళి ఎంత టైమ్ తీసుకుంటారో ఎవరూ చెప్పలేరన్నారు. ఆ సినిమాల తర్వాత రూ.1000 కోట్లు కాదు.. ఇక రూ.10వేలు, రూ.20వేల కోట్ల గురించే మాట్లాడుకుంటారని.. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×